జంతువు మలంతో తయారయ్యే కాఫీ… 5600 రూపాయలు. అది ఎక్కడ తయారుచేస్తారో తెలుసా?

0
197

అవాక్కయ్యారా?. అయినా సరే నిజం ఇదే. ఇదేదో సెవన్ స్టార్ హోటల్ లో తాగినందుకు అయ్యే ఖర్చు కాదు. సహజంగానే ఆ కాఫీ ఖరీదు అంత ఉంటుందట. ఆ వెరైటీ కాఫీ కనిష్ట ధర 2450 రూపాయలు. గరిష్ట ధర మాత్రం 5600 రూపాయలు. అసలు ఏంటీ కాఫీ కథ అంటారా?. సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ ట్వీట్ తో ఈ విషయం చర్చకు వచ్చింది. ఆయన కొత్తగా ఇఫ్పుడు హీరో రామ్ తో కలసి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కారణం ఏంటో తెలియదు కానీ..హీరో తన దర్శకుడికి ఈ ఖరీదైన కాఫీ గింజల ప్యాకెట్ ను గిఫ్ట్ గా పంపారు. ఇదే విషయాన్ని పూరీ జగన్నాధ్ ట్విట్టర్ ద్వారా చెబుతూ తనకు హీరో రామ్..ప్రపంచంలోనే ఖరీదైన కాఫీని పంపాడని..దాన్ని తాగుతున్నానని ఫోటోలు పోస్ట్ చేశాడు.

అంతే కాదు.ఈ కాపీ గురించి కావాలంటే గూగుల్ లో వెతకండి అన్ని విషయాలు తెలుస్తాయి అని పేర్కొన్నారు. అంతే కాదు..ఈ కాఫీ పిచ్చెక్కిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ పై రామ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ కాఫీ గురించి గూగుల్ లో వెతక్కండి..దీని గురించి తెలిస్తే దిమాక్ ఖరాబ్ ఐతది అని వ్యాఖ్యానించారు. ఈ కాఫీ గురించి ఆసక్తికర విషయాలు ఏంటి అంటే..ఈ లువాక్ కాఫీని చెర్రీస్ తో తయారు చేస్తారు.

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన కాఫీల్లో ఇదొక‌టి. ఇండోనేసియా స‌మీప ప్రాంతాల్లో మాత్ర‌మే ఈ కాఫీ గింజ‌లు ల‌భ్య‌మ‌వుతాయి. ఈ గింజ‌ల‌తో త‌యార‌య్యే ఒక క‌ప్పు కాఫీ తాగాలంటే 4 నుంచి 5 వేల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాల్సిందే. అయితే ఈ కాఫీ గింజ‌ల‌ను ఎలా సేక‌రిస్తారో తెలిస్తే మాత్రం అదోర‌కమైన ఫీలింగ్ క‌లుగుతుంది.ఇండోనేసియా, సుమ‌త్రా దీవుల్లో ఉండే ఆసియ‌న్ పామ్ సివెట్ అనే జంతువుకు కాఫీ చెర్రీస్‌ను తినిపిస్తారు.

వాటిని తిన్నకొద్ది సేప‌టి అనంతరం ఆ జంతువు నుంచి వ‌చ్చిన మ‌లాన్ని సేక‌రించి దానితో ఈ కాఫీ పొడిని త‌యారుచేస్తారు. ఇందుకోసం ఆ జంతువుల‌ను చిన్న చిన్న బోనుల్లో బంధించి వాటికి కాఫీ చెర్రీల‌ను మాత్ర‌మే ఆహారంగా పెడ‌తారు. అనంత‌రం వాటి నుంచి మ‌లం రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన కాఫీ గింజ‌ల‌ను సేక‌రిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్లే కోపీ లువాక్ కాఫీకి అద్భుత‌మైన రుచి వ‌స్తుంద‌ట‌. ఇలా కాఫీ కోసం ఆ జంతువుల‌ను హింసిస్తున్నందుకు గ‌తంలో నిర‌స‌న‌లు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here