మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ విజేత మూవీ రివ్యూ

0
947

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకుపైగా హీరోలు సందడి చేస్తున్నారు. తాజాగా మరో మెగా హీరో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రాకేష్ శషి డైరక్షన్ లో వచ్చిన సినిమా విజేత. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ ఎమోషనల్ గా వచ్చిన ఈ తొలి సినిమాతో కల్యాణ్ దేవ్‌ ఆకట్టుకున్నాడా..? ఈ విజేత బాక్సాఫీస్‌ ముందు విజేతగా నిలిచాడా..?

ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎలాంటి బాధ్యత లేకుండా తిరుగుతున్న రామ్‌ (కళ్యాణ్ దేవ్) ప్రస్తుతం యువత ఆలోచన విధానంతో జాలీగా రోజులు గడుపుతుంటాడు. లైఫ్ లో సెటిల్ అవ్వాలన్న తండ్రి శ్రీనివాసరావు (మురళి శర్మ) మాటలను పెడచెవినపెడుతూ వస్తాడు. ఎదురింట్లోకి కొత్తగా వచ్చిన జైత్ర (మాళవిక నాయర్) ను లవ్‌లో పడేసేందుకు ప్రయత్నిస్తుంటాడు రామ్‌. ఓ బిజినెస్ ప్లాన్ చేయగా అది సక్సెస్ అవదు. ఇక ఫైనల్ గా తండ్రి అతని మీద ఆశలన్ని చంపుకోగా తండ్రి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని హీరోయిన్ సాయం పొందుతాడు. తండ్రిని మెప్పించేలా హీరో లైఫ్ ఎలా సెటిల్ అయ్యాడు అన్నది సినిమా కథ.

విజేతతో వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్‌ పరవాలేదనిపించాడు. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్‌ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ ఆకట్టుకుంది. పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. ఇక సినిమా మేజర్‌ ప్లస్ పాయింట్‌ మురళీ శర్మ. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. కొడుకు కోసం ఏదైన చేసేయాలనుకునే మధ్య తరగతి తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన చాలా సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది.

రాకేష్‌ తనదైన టేకింగ్‌ తో మెప్పించాడు. తొలి భాగం హీరో ఫ్రెండ్స్‌ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో పాటు లవ్‌ స్టోరితో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషనల్‌ డ్రామాగా మలిచాడు. చాలా సన్నివేశాల్లో రామ్‌ పాత్ర ఈ జనరేషన్‌ యువతకు ప్రతీకల కనిపిస్తుంది. మధ్య తరగతి జీవితాల్లో కనిపించే ఇబ్బందులు, సర్దుబాట్లను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించిన దర్శకుడు పాత్రల ఎంపికలోనూ తన మార్క్‌ చూపించాడు. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్‌, నోయల్‌, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్‌ హాఫ్‌లో బాగానే నవ్వించారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయ ప్రకాష్‌, రాజీవ్‌ కనకాల తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ఇక హీరోగా కళ్యాణ్ దేవ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అతన్ని ప్రమోట్ చేయడమే బాధ్యతగా ప్రతి సీన్ లో అతన్ని చూపించడం జరిగిందని చెప్పొచ్చు. అయితే అతని డిక్షన్, డైలాగ్ డెలివరీ కొంత వరకు ఓకే అనిపించినా ఇంకాస్త హార్డ్ వర్క్ చేయాల్సిందని అనిపిస్తుంది. సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ కూడా అంత క్రేజీ గా ఉండవు. సినిమా మొత్తం కళ్యాణ్ దేవ్ మీదనే నడుస్తుంది. మొదటి సినిమా వన్ మ్యాన్ షో చేయడం కష్టమే అయితే సినిమా కథ, కథనాలు కొత్తగా అనిపించకపోవడం కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవడం వంటివి సినిమా కి కొద్దిగా మైనస్ పాయింట్ అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here