మ‌ల్లాను ఛీకొడుతున్న విశాఖ ప‌శ్చిమ ఓట‌ర్లు

0
312

జ‌నం సొమ్మును జ‌ల‌గ‌ల్లా పీల్చేసే వాడెవ‌డైనా.. ప్ర‌జాస్వామ్యానికి తీవ్ర హానిక‌రమే. ప్ర‌జ‌ల బ‌తుకులు బుగ్గి చేసి.. చ‌లిమంట కాగే వాళ్ల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. విశాఖ ప‌శ్చిమ‌లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న అభ్య‌ర్థి మ‌ల్ల విజ‌య‌ప్ర‌సాద్ ఇలాంటి కోవ‌కు చెందిన వ్య‌క్తే. ఒక్క‌సారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకే.. సాంతం ఊడ్చేసి.. వేల కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసిన ఘ‌నుడు మ‌ల్ల విజ‌య‌ప్ర‌సాద్‌. రాజ‌కీయ‌మంటే డ‌బ్బుల‌తో కొన‌డం, అమ్మ‌డం అనుకునే మ‌ల్లా లాంటి వాళ్ల‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

క‌నీసం విలువ‌లు లేకుండా.. సీబీఐ లాంటి దేశంలోనే అతిపెద్ద ద‌ర్యాప్తు సంస్థ‌ల కేసుల్లో చిక్కుకున్న నిందితుల‌ను పూర్తిగా ప్ర‌జాస్వామ్యం నుంచే బ‌హిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అలాంటి వాళ్లు మాకొద్దంటూ విశాఖ ప‌శ్చిమ ప్ర‌జ‌లు.. ఇప్పుడు ఇంటింటా చ‌ర్చించుకుంటున్నారు. విశాఖ ప‌శ్చిమ‌లో ఎక్క‌డిక‌క్క‌డ మ‌ల్లా విజ‌య‌ప్ర‌సాద్‌కు ఓట్లేయొద్దంటూ.. స్వ‌చ్ఛందంగా కాల‌నీలు, వాడ‌ల్లోని ప్ర‌జ‌లు తీర్మానాలు చేసుకుంటున్నారు. నిజాయ‌తీగా, నీతిగా.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే వ్య‌క్తికి ప‌ట్టం క‌ట్టాల‌ని.. ప్ర‌జ‌లంతా ప్ర‌తిన బూనుతున్నారిప్పుడు.

ప్ర‌స్తుతం  విశాఖ ప‌శ్చిమ‌లో పోటీలో ఉన్న రెండు ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల్లో.. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు విశాఖపట్నం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ప్ర‌తి ఇంటికీ ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి. స్థానికంగా.. అంద‌రితో కిలిసిపోవ‌డంతో పాటూ.. గ‌త ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల ప్ర‌తి క‌ష్టంలోనూ తానున్నాంటూ ముందుకొచ్చి.. ప‌రిష్కారం చూపిన వ్య‌క్తి. సౌమ్యుడు, విద్యావంతుడు కావ‌డంతో పాటూ.. ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉండే వ్య‌క్తి.    అందుకే.. ఇప్పుడు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రిని అడిగినా.. చెప్పే మాట‌.. మా గ‌ణ అన్న చాలా మంచోడు. అత‌డుంటే.. ఇంక మేము ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదంటున్నారు. మ‌రోవైపు వైసీపీ త‌ర‌ఫున విశాఖ ప‌శ్చిమ‌లో పోటీలో ఉన్న అభ్య‌ర్థి మ‌ల్లా విజ‌య‌ప్ర‌సాద్ త‌న అన‌ధికార వ‌సూళ్ల‌తో.. విశాఖ ప‌రువును దేశ‌వ్యాప్తంగా మంట‌క‌లిపేలా చేసిన వ్య‌క్తి. ఒక‌సారి ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి.. ఓట్లేసిన ప్ర‌జ‌ల నుంచి నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా.. డిపాజిట్ల‌ను వ‌సూలు చేసి..  ఇప్ప‌టికీ చెల్లించ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న అవినీతి వృక్షం. ఇప్ప‌టికీ.. ఆయ‌న జ‌నం నుంచి వ‌సూళ్లు చేసిన 1250 కోట్ల రూపాయ‌ల‌కు లెక్క‌లు లేవ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వాటిని జ‌నాల‌కు ఇవ్వాల‌నే.. క‌నీస ఆలోచ‌న కూడా చేయ‌ని మ‌ల్లా విజ‌య‌ప్ర‌సాద్‌.. మ‌ల్లా త‌న‌ను గెలిపించాలంటూ.. విశాఖ ప‌శ్చిమ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు మాయ చేసేందుకు వ‌స్తున్నాడు.

మ‌ల్లాను ఛీకొడుతున్న‌ ఓట‌ర్లు..
వైసీపీ అభ్యర్థి మ‌ల్లా విజ‌య‌ప్ర‌సాద్ విశాఖ ప‌శ్చిమ‌లో ఎక్క‌డికెళ్లినా..  అక్క‌డ చుక్కెదుర‌వుతోంది. విజ‌య‌ప్ర‌సాద్ ముఖం మీదే జ‌నం.. అత‌ను చేసిన అక్ర‌మ వ‌సూళ్ల‌ను అడిగి.. నిల‌దీస్తున్నారు.  2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన విజ‌య‌ప్ర‌సాద్‌ను గెలిపించ‌డం తాము జీవితంలోనే చేసిన అతిపెద్ద త‌ప్పంటున్నారు. ఒక్క‌సారి గెలిపించినందుకే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క అభివృద్ధి ప‌ని కూడా చేయ‌కుండా.. కేవ‌లం త‌న సంస్థ‌ల్లోకి ఎవ‌రి నుంచి డిపాజిట్ల‌ను ఎలా మ‌ళ్లించాలా.. అనే పథ‌క ర‌చ‌న‌తోనే మ‌ల్లా గ‌డిపేశాడు. ప్ర‌భుత్వం నుంచి విడుద‌లైన నిధుల‌ను స్వాహా చేయ‌డంలోనూ దిట్టేన‌నే విమ‌ర్శ‌లున్నాయి. గెలిపించిన పాపానికి.. ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటం ఆడుకున్నార‌నే అప‌వాదు మ‌ల్లా పై ఉంది. పాపం పండి.. ఏకంగా సీబీఐ దృష్టిసారించాల్సిన పరిస్థితి. మ‌ల్లా కంపెనీల‌పై సీబీఐ కేసులు న‌మోదు చేయ‌డం.. విశాఖ ప‌రువునే మంట‌గ‌లిపేలా చేసింది. దీంతో ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం మ‌ల్లాను ఛీ కొడుతున్నారు. ఈ ప‌రిణామం ఊహించ‌ని మ‌ల్లా.. మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టిద్దామ‌ని వ‌చ్చి బోల్తాప‌డ్డాడు. దీంతో  ఎలాగైనా ప్ర‌త్య‌ర్థిగా ఉన్న గ‌ణ‌బాబుపై గెలిచి తీరాల‌ని పంతంతో.. ఏదైనా చేసేందుకు వెనుకాడేది లేదంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నాడు. కానీ.. ప్ర‌జ‌ల సంపూర్ణ మ‌ద్ద‌తు ఉన్న గ‌ణ‌బాబును ఇప్ప‌టికే ప్ర‌జ‌లు స్థానికంగా గెలిపించార‌. ఇక ఎన్నిక నామ‌మాత్ర‌మేన‌న్న‌ది విశాఖ ఓట‌ర్లంటున్న మాట‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here