వెంకటేష్ కూతుర్లు ఇప్పుడు ఏంచేస్తున్నారో తెలుసా? చూడండి

0
1290

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే నటులలో విక్టరీ వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారు. కేవలం తన సినిమాలతోనే కాకుండా.. మంచి ప్రవర్తన నడవడిక స్నేహగుణంతో అందరి మనసు దోచుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన సినిమాలు తాను చేసుకునే వెంకటేష్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. అలంటి వెంకటేష్ తన కుటుంబాడబుల విషయాలను మాత్రం ఎక్కడ పంచుకోరు. వెంకటేష్ కుటుంభంలో తండ్రి రామానాయుడు.. అన్న సురేష్ బాబులా గురించి చాలా మందికి తెలుసు… కానీ..

వెంకటేష్ భార్య పిల్లలు ఎలా వుంటారు.. వారిప్పుడు ఏంచేస్తున్నారు.. అనే విషయాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. అందుకే ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబందించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. వెంకటేష్ భార్య పేరు నీరజా. వీరి వివాహం 1985 లో జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఆశ్రిత, హయవాహిని,భావన లు అమ్మాయిలు. అబ్బాయిపేరు అర్జున్. వీరిలో పెద్ద కూతురు ఆశ్రిత బిజినెస్ లో ఆసక్తి చూపిస్తుంది.

వ్యాపార రంగం లో అద్భుతాలు చెయ్యాలి అనుకుంటున్నట్లు ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఇక రెండవ కూతురు హయవాహిని ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆయా రంగంలో ద్రుష్టి పెట్టింది. ఇప్పటికే హయవాహిని డిజైన్ చేసిన దుస్తులకు సూపర్ రెస్పాన్స్ వచ్చి హిట్ అయ్యాయి. ఇక వెంకీ చిన్న కూతురు భావన త్వరలోనే సినిమారంగంలోకి రావాలని ఆసక్తి కనబరుస్తుందట.. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న భావన మంచి కథ దొరికితే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక కొడుకు అర్జున్ మాత్రం సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై త్వరలోనే వెంకటేష్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు తన భార్య పిల్లలను బయటికి తీసుకురాని వెంకటేష్ ఇటీవలే జీవీకే మనవరాలు పెళ్ళిలో భార్య నీరజాతో కలిసి రావడం కనిపించింది. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో ఫంక్షన్ లో తనకొడుకు అర్జున్ ని మీడియా కి పరిచయం చేసారు. కానీ వెంకటేష్ కూతుర్లు మాత్రం ఇప్పటికి మీడియాకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం దగ్గుపాటి ఫ్యామిలీలో జరిగిన ఒక ఫంక్షన్ ద్వారా ఇప్పుడు వెంకటేష్ కూతుర్లు ఇప్పుడు ఎలాఉన్నారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలు వెంకటేష్ అభిమాలులకు ఆనందాన్ని పంచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here