వీర బోగ వసంత రాయలు రివ్యూ

0
1783
Veera Bhoga Vasantha Rayalu Review

కల్ట్ ఇస్ రైసింగ్, కల్ట్ విల్ రైజ్ అని చెప్పి ఒక కల్ట్ సినిమాగా మనముందుకు వచ్చిన వీర బోగ వసంత రాయులు సినిమా చుసిన తరువాత మనకి ఈ సినిమాలో ఏ ఒక్క సీన్ లో కానీ, Story లో కానీ ప్రెసెంటేషన్ లో కానీ, డైరెక్షన్ లో కానీ, పెరఫార్మన్సెస్ లో కానీ స్క్రీన్ ప్లే లో కానీ ఆ… కల్ట్ ఫీలింగ్ ఎక్కడ కనపడదు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన నారా రోహిత్ మరియు శ్రియ ఈ సినిమాలో ఎందుకు పెర్ఫర్మ్ చేశారురా వీళ్లిద్దరు… వీళ్లిద్దరికీ అసలు ఈ సినిమాలో అంత ఇంపోర్టన్స్ ఏముంది అన్నట్లు సినిమా చుసిన తరువాత అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ ఒక్క సీన్ లోను వాళ్ళ క్యారెక్టర్ ని పెర్ఫర్మ్ చేసే స్కోప్ లేకపోవడం వలన వాళ్ళకి ఈ సినిమాలో వాళ్ళు సినిమా ని ముందుకు నడిపించలేకపోయారు.

Veera Bhoga Vasantha Rayalu Review
Veera Bhoga Vasantha Rayalu Review

అందరితో పోలిస్తే సుదీర్ బాబు కి సినిమాలో లెన్త్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్. కానీ సుదీర్ బాబు కూడా అంత బాగా చేసాడని చెప్పడానికి ఏంలేదు. అయన డబ్బింగ్ అయన చెప్పుకోకపోడం వలన… ఆ.. సుధీర్ బాబు వాయిస్ ఏంటి ఎలా ఉంది. ఇది సుధీర్ బాబు వాయిస్ కాదు కదా.. అని మనం కొంచం డీవియేట్ అయ్యి అయన వాయిస్ కి కనెక్ట్ అవ్వకుండా… అయన క్యారెక్టర్ ని సినిమా మొత్తం చూడాల్సి వస్తుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు కి డిఫ్రెంట్ లుక్ ఇచ్చారు. కాకపోతే ఆ లుక్ మనకి అంతగా( అబ్బా ఎం లుక్ రా అని) అనిపించదు.

మన శ్రీ విష్ణు ని చూపించిన విధానం కానీ, అయన క్యారెక్టర్ కానీ, అయన ప్రెసెంట్ చేసిన విధానం కానీ అంత పవర్ ఫుల్ గా ఉండదు జస్ట్ నార్మల్ గానే ఉంటుంది. కొన్ని కొన్ని సీన్స్ శ్రీ విష్ణు మనల్ని కన్విన్స్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. శ్రీ విష్ణు చేత ఇంగ్లీష్ మాట్లాడించిన కొన్ని కొన్ని సీన్స్ మాత్రం “బాబు మనకి ఎందుకు బాబు ఈ సినిమాలో ఇంగ్లీష్ ” అవసరమా అని అనిపిస్తుంది. ఆ సీన్స్ ని తీసేసి ఉంటె బాగుండేది ఎందుకంటే అక్కడ సీరియస్ గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మనకి ఇక్కడ ఎక్కడో కామెడీ గా సరదాగా అనిపించే ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ ఉన్నాయి.

మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ప్రెసెంటేషన్ కానీ, సినిమాటోగ్రాఫ్య్ కానీ అంత ఇంప్రెసివ్ గా లేవు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని డల్గా అనిపిస్తాయి. ఈ సినిమా స్టోరీ నెవెర్ సీన్ బిఫోర్ స్టోరీ గా ముందు చెప్పుకున్నారు కానీ… ఈ స్టోరీ ని రీసెంట్ గానే కొన్ని సినిమాలలో చూసాము. ఈ సినిమాలో ఎటువంటి కొత్త విషయాలు ఉండవు. డైరెక్టర్ సినిమాని చాలా స్లో గా, చాలా డల్గా ప్రెసెంట్ చెయ్యడం వలన మనకి కొంచం చిరాకుగా ఏంటి మనం ఏమైనా సీరియల్ చూడడానికి వచ్చామా అన్న ఆలోచన కలుగుతుంది.

ఈ సినిమాలో చివరి 20 నిముషాలు కాన్సెన్ట్రేషన్ తో చూడాలి ఎందుకంటే చివరలో సినిమాని కొంచం మిస్ అయినా జుట్టుపీకోవలసి వస్తుంది. ఇక సినిమా మొదటినుండి చివరివరకు చాలా స్లో గా నడిచిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎవరు ఎందుకు చచ్చిపోతున్నారు. అసలు అక్కడ ఎం జరుగుతుంది. డైరెక్టర్ మనకి ఎం చెపుదాం అనుకుంటున్నాడు. అసలు ” వెర్ ఇస్ ది కల్ట్, వెర్ ఇస్ ది కల్ట్ ” అని మనం వెతుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ పాజిటివ్ గానే ఉన్న దాన్ని ఫాస్ట్ గా చెప్పకుండా స్లో గా చెప్పడం వలన లాస్ట్ 20 నిమిషాలని పొడిగించడం వలన మనం సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ కి కన్విన్స్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here