వధువుతో పురోహితుడు జంప్ ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

0
764

పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత మరియు లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.

అయితే ఇటీవలే ఒక నవ వధువుతో పురోహితుడు పరారయ్యాడు. నగలు, డబ్బుతో సహా ఆమెతో కలిసి ఉడాయించాడు. తొలుత యువతి పురోహితుడితో పారిపోయిందని తెలిస్తే పరువు పోతుందని తల్లిదండ్రులు భావించగా.. భర్త ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన అందర్ని షాక్‌కు గురి చేస్తోంది.

విధిష జిల్లాలోని సిరోంజ్‌ పట్టణానికి చెందిన యువతికి ఈ నెల 7న వివాహయ్యింది. పెళ్లి తంతు ముగిసినా నవ వధువు అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంది. వధువు కూడా వ్యక్తిగత కారణాలు చెప్పడంతో.. అత్తింటివారు అభ్యంతరం చెప్పలేదు. తర్వాత సీన్ కట్ చేస్తే.. ఈ నెల 23న వధువు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెతికారు.. తర్వాత ఏం జరిగిందని ఆరా తీస్తే.. ఆమె పెళ్లి చేసిన పురోహితుడు వినోద్ మహారాజ్‌తో పరారైనట్లు తేలింది.

యువతి ఇంట్లో నుంచి పరారవుతున్న సమయంలో ఇంట్లో నుంచి రూ.లక్షన్నర విలువ చేసే బంగారం, రూ.30వేలు పట్టుకెళ్లింది. వధువు పరారైన తల్లిదండ్రులు పరువు పోతుందని భావించారు. కానీ ఆమె భర్త మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కారణం తెలిసి షాక్ తిన్నారు. వెంటనే వధువు, పురోహితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. వినోద్ శర్మకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారట. కొద్ది రోజుల క్రితం అతడికి యువతితో పరిచయం ఏర్పడిందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here