యోగాలో 10 బెస్ట్ ఆసనాలు ఇవే… రోజూ పాటిస్తే ఎన్ని లాభాలంటే..

0
907

యోగాఅనేది 5౦౦౦సంవత్సరాలనుండిభారతదేశంలోఉన్నజ్ఞానముయొక్కఅంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలంకొన్నిశారీరిక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక. విజ్ఞానశాస్త్ర ప్రకారము యోగా అంటేపరిపూర్ణ జీవనసారవిధానము .దీనిలోజ్ఞాన యోగము (తత్వశాస్త్రము ), భక్తి యోగము , రాజ యోగము మరియు కర్మ యోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైనచెప్పిన యోగాలన్నిటిలో సమతౌల్యాన్ని , ఏకత్వాన్ని తీసుకువస్తాయి.

యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కొన్ని అద్భుత ప్రయోజనాలిచ్చే ఆసనాలున్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

1. వజ్రాసనం : జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే శక్తి వజ్రాసనంకి ఉంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఈ ఆసనాన్ని రెగ్యులర్‌గా వేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. అంతేకాదు, మనసు, శరీరానికి ప్రశాంతతనివ్వడంలో ఈ ఆసనం బెస్ట్.

2. గరుడాసనం : ఒత్తిడితో ఇబ్బందిపడేవారు ఈ ఆసనం వేయడం వల్ల సమస్య పరిష్కారమవతుంది. రెగ్యులర్‌గా వేస్తే డిప్రెషన్ హుష్ కాకి.. అదే విధంగా మనసు మన అదుపులో ఉంటుంది. భుజాలు, తుంటి భాగాలను రిలాక్స్ చేసేందుకు ఈ ఆసనం బాగా హెల్ప్ చేస్తుంది.

3. ఉత్తానాసనం : కొన్నిసమయాల్లో ఎన్నో ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. ఉత్తానాసనం అలాంటి ఆలోచనలను దూరం చేస్తుంది. మనసు నిశ్శబ్ధంగా ఉండేందుకు.. నెర్వ్‌సిస్టమ్ బ్యాలెన్స్ కావడానికి ఈ ఆసనం హెల్ప్ చేస్తుంది.

4. భుజంగాసనం…సిస్టమ్ వర్క్ చేసేవారు మెడనొప్పులు, వెన్నునొప్పితో బాధపడుతుంటారు. అలాంటివారికి ఈ ఆసనం బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల మెడ, వెన్ను నరాలు రిలాక్స్ అవుతాయి. రెగ్యులర్‌గా చేయడం వల్ల అదనపు లాభాలుంటాయి.

5. యోగా నిద్ర : 5 నిమిషాలపాటు ఉండే ఈ నిద్ర వల్ల శారీరకంగా, మానసికంగా రిలాక్స్ అవుతుంది. ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది.

6. నౌకాసనము : ఈ నౌకాసనము, మీ ఊపిరితిత్తుల పనితీరును సక్రమంగా జరిగేటట్లు మెరుగుపరచగలదు మరియు పొట్ట భాగంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనమును కలుగచేస్తుంది. అయితే ఈ ఆసనం, అల్సర్ మరియు హెర్నియాతో బాధపడుతున్న వారికి అనుకూలమైనది కాదు.

7. ఉత్తిట పార్శ్వకోనాసనము : ఈ విధమైన భంగిమలో మీరు పక్కకు విస్తరించడం వల్ల మీ కాళ్లకు మరియు వెన్నెముకకు సాగే గుణాన్ని పెంచబడుతుంది. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తూ, కడుపులో ఉన్న కండరాలకు మంచి శక్తిని కలుగజేస్తుంది. ఈ యోగ భంగిమ, కొవ్వును తొలగించుట లో చాలా ప్రభావవంతమైనదిగా పని చేస్తుంది. ఇది కడుపులో ఉన్న అవయవాలను ఉత్తేజితం చేస్తూ, వాటికి బలాన్ని చేకూరుస్తుంది.

8. జలంధర బంధము : మీరు నిటారుగా కూర్చుని, కొన్ని క్షణాలపాటు సాధారణ స్థాయిలో శ్వాసను తీసుకోవటానికి ప్రయత్నించండి. ఈ ఆసనము బొద్దుగా అందంగా ఉన్న ముఖాన్ని తిరిగి పునరుత్తేజితం చేయటంలోనూ మరియు సొట్టగా ఉన్న గడ్డముును సరిచేయడంలో కీలకపాత్రను పోషిస్తుంది. మీ ముఖ కండరాలకు శక్తిని చేకూర్చి, మీరు మరింత అందంగా కనబడేటట్లుగా చేస్తుంది.

9. అధోముఖ స్వనాసనం : ఈ ఆసనం మీ కండరాలను, అలాగే మీ శరీరమంతటికీ అవసరమైన శక్తిని పెంపొందించడంలో సహాయం చేస్తుంది. ఇది వేగంగా శరీర బరువును తగ్గించటాన్ని ప్రోత్సహిస్తుంది మరియు మీరు ఈ భంగిమలో సాధన చేసినప్పుడు మరింత శక్తివంతంగా మారినట్లుగా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీ మనసును ఆహ్లాదపరుస్తుంది మరియు మీ వెన్నెముకను బాగా పొడిగించటానికి ప్రయత్నిస్తుంది.

10. ఉష్ట్రాసనం : ఈ ఆసనం వలన మడమలు, తొడలు, శరీరం, ఛాతీ, గొంతు, కటి, పొత్తి కడుపులను దృఢంగా ఉంచడానికి ఈ భంగిమ చాలా మంచిది. ఇది మెడ, పొత్తికడుపు అంగాలను నియంత్రించుటలో సహాయపడుతుంది. ఈ భంగిమ ఉబ్బసం దుష్ప్రభావాలను తొలగించి శ్వాసకోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here