తిరుమలపై ఉన్న ఏకైక శివ క్షేత్రాన్ని మీరు దర్శించుకున్నారా?

0
311

భూలోక వైకుంఠమైన తిరుమల.. శ్రీవైష్టవ క్షేత్రమని, శ్రీనివాసుడు సన్నిధి అని మనకు తెలిసిందే. ఒక ఆలయ పాలనా వ్యవహారాలు చూసే సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ సంస్థ తిరుమలతో పాటు అనేక చోట్ల వైష్టవాలయాల పాలనా బాధ్యతలను స్వయంగా చూస్తుంది. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం కపిలతీర్థం. పరమేశ్వరుడు తిరుమల క్షేత్రపాలకుడు కావడమే ఇందుకు కారణం. వేంకటాచల పాద సమీపంలో (తిరుపతిలో) ఉన్న కపిలతీర్థాన్ని సుదర్శన చక్రత్తాళ్వార్‌ తీర్థం, చక్రత్తాళ్వారు తీర్థం. ఆళ్వారు తీర్థం అని కూడా పిలుస్తారు.

ఏడుకొండల నుంచి అనేక ఔషధ మూలికలను తాకుతూ జాలువారే పుణ్యధారలతో ఏర్పడిన కపిలతీర్థం సరోవరం పక్కనే. స్వయంభువ్ఞగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర మహశివలింగం గల గుహాలయం ఉంది. కపిలేశ్వరుడితో పాటు కామాక్షి అమ్మవారు, నరసింహస్వామి తదితర ఆలయాలనూ దర్శించుకోవచ్చు. తిరుమల ఎంతటి ప్రాచీనమైనదో అంతకంటే ప్రాచీనమైనది కపిలేశ్వరస్వామి ఆలయం అని చెపుతారు. పద్మావతికి, శ్రీనివాసుడికి కల్యాణం జరగాలని అనుగ్రహించిన వరప్రదాత కపిలేశ్వరుడు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనానికి ముందు.. కపిలతీర్థాన్ని దర్శించి తీర్థవిధులు నిర్వహించాలి. ఆ తర్వాత ఆపదమొక్కుల వాడిని దర్శించుకోవాలని స్థలపురాణం.

తన దర్శనానికి వచ్చిన యాత్రికుల పాపాలను కపిలేశ్వరుడు దూరం చేస్తాడట. కపిలేశ్వరుని వల్ల పాపవిముక్తులైన వారికి అమృతత్వాన్ని (వేం), ఐశ్వర్యాన్ని (కట) ప్రసాదిస్తాడట వేంకట రమణుడు. ఏడు కొండల్లో నెలకొన్న అనేక పుణ్యతీర్థాలను దాటుకుని కపిలతీర్థం సరోవరంలో పడేందుకు వస్తున్న ధారల కింద నిలబడి స్నానమాచరించడం యాత్రికులకు మరపురాని అనుభూతనే చెప్పాలి. తిరుపతిలోని అలిపిరికి సమీపంలోనే ఉన్న ఈ క్షేత్రం ముందు నుంచే తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ రాకపోకలు సాగిస్తాయి. కాబట్టి యాత్రికులు సులువ్ఞగానే కపిలతీర్థం చేరుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here