సాయిధరమ్ తేజ్ “తేజ్ ఐ లవ్ యూ ” మూవీ రివ్యూ

0
1260

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సాయిధరమ్ తేజ్ మొదట్లో విజయాన్ని అందుకున్నప్పటికీ అ తరువాత పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఈ తరుణంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో మరో అడుగు ముందుకు వేశాడు. తేజ్ తాజాగా నటించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యూ’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. టాలీవుడ్ లో ఎన్నో మంచి చిత్రాల్ని తీసిన కే.ఎస్. రామారావు దీనికి నిర్మాతగా వ్యవహరించారు. గోపి సుందర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మరి తేజ్ ఈసారైనా హిట్ కొట్టాడో లేదో మన సమీక్షా లో చూద్దాం.

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ్ (సాయిధరమ్ తేజ్) పెదనాన్న(జయప్రకాష్)తో కలిసి ఉంటాడు. అయితే ఓ హత్య విషయమై తేజ్ జైలుకి వెళ్తాడు. అక్కడే పెద్దవాడై రిలీజ్ అవుతాడు. జైలు నుండి వచ్చిన తేజ్ ను ఇంట్లోకి రానివ్వడు పెదనాన్న దీనితో హైదరాబాద్ వెళ్లి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాడు. ఆ ట్రైన్ జర్నీలో నందిని (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిన తేజ్ ఆమెను ఇంప్రెస్ చేయాలని చూస్తుంటాడు. కొంతమంది స్నేహితులను ఏర్పరచుకుని మ్యూజిక్ బ్యాండ్ ట్రూప్ రన్ చేస్తుంటాడు. ఈలోగా అనుకోని విధంగా ఓ యాక్సిడెంట్ లో నందిని తన గతాన్ని మర్చిపోతుంది. నందినికి గతాన్ని గుర్తుచేయాలని తేజ్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. తన ప్రేమ ద్వారా నందినిని ఎలా మళ్లీ మాములు మనిషిని చేశాడు..? నందిని, తేజ ల ప్రేమ ఎలా ముగిసింది అన్నది సినిమా కథ.

అయితే ఎంచుకున్న కథను నడిపించిన కథనం కరుణాకరణ్ ఇదవరకు సినిమాల ప్రభావం కనిపిస్తుంది. ప్రభాస్ డార్లింగ్ సినిమా ఎఫెక్ట్ తేజ్ ఐలవ్యూ మీద చాలా ఉందనిపిస్తుంది. కథ పాతదే.. కథనం కూడా పాత పద్ధతిలోనే నడిపించారు. వరుస అపజయాలతో సతమతమవుతున్న తేజూ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కంటే అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ ఎంతో మెరుగ్గా, డామినేటింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సాయిధరమ్ కూడా మిగిలిన సినిమాలతో పోలిస్తే ఇందులో లవర్ బాయ్ గా ఆకట్టుకున్నా…అనుపమ ముందు నిలబడలేకపోయాడు. సినిమాలో పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఆండ్రూ ఫిక్చరైజేషన్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా లవ్ స్టోరీ కాస్తా అనేక ప్రేమ కథల సమాహారంగా ఉండటంతో మరోసారి ఈ కుర్ర హీరోకు మరోసారి నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. సినిమా ఫస్టాఫ్ ఒకింత కూల్ గా సాగిపోతుంది. సెకండాఫ్ ఒకింత భారంగా కదులుతుంది. ఓవరాల్ గా చూస్తే ‘తేజ్ ఐ లవ్ యూ’ అంతగా పండలేదనే చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here