‘నోటా’ చిత్రంతో డీలాపడ్డ విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ తో హిట్ కొట్టాడా? రివ్యూ

0
1628

‘నోటా’ చిత్రంతో డీలాపడ్డ విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ‘టాక్సీవాలా’ అంటూ స్టీరింగ్ పట్టి రయ్ మంటూ దూసుకొస్తున్నారు. ఆయన స్పీడ్‌కు పైరసీ స్పీడ్ బ్రేకర్స్‌గా తగిలినప్పటికీ రెట్టించిన వేగంతో బండిని గాడిలో పెట్టేందుకు నేడు ‘టాక్సీవాలా’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌‌ మూవీ చేయడం దేవరకొండ కెరియర్‌లో ఇదే తొలిసారి. ఇందులో విజయ్ టాక్సీడ్రైవర్‌గా సందడి చేస్తున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ తాజా చిత్రంతో మళ్లీ హిట్ కొట్టాడా లేదా అన్నది ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం.

Vijay Deverakonda Taxiwala Movie Review ULTRA HD Posters WallPapers | Priyanka Jawalkar

సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టాక్సీడ్రైవర్‌గా కనిపించారు. బతకుతెరువు కోసం టాక్సీడ్రైవర్‌గా మారిన చదువుకున్న యువకుడి కథే ‘టాక్సీవాలా’. అయితే తానే ఎంచుకున్న వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. టాక్సీతో పాటు ఓ పాసింజర్ వల్ల అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి లాంటి ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌, హీరోయిన్ ప్రియాంక జువల్కర్‌లకు కూడా ఇదే తొలిచిత్రం కావడం విశేషం. తాజా చిత్రంలో విజయ్ దేవరకొండ లుక్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ‘టాక్సీవాలా’ కథకు అనుగుణంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్.. ‘టాక్సీవాలా’ టాప్ గేర్‌లో దూసుకుపోవడం ఖాయమే అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది చిత్ర యూనిట్.

ఫస్ట్ హాఫ్ లో ఒక పది నిమిషాలు మినహా మిగిలిన సినిమా అదిరిపోయింది. చక్కటి ప్రయత్నం చేసిన దర్శకుడిని అభినందించాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా బావుంది. సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ యాక్టింగ్ బావుంది. దర్శకుడు కథని పక్కదారి పట్టించకుండా లాజికల్ గా పట్టున్న కథనంతో నడిపించారు. సెకండ్ హాఫ్ ని సాగదీశారు. అయినా కూడా చిత్రంలో ఫన్ బావుంది. విజయ్ దేవకొండ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. మీరు కొన్న టికెట్ కు మంచి వినోదం అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here