ప్రపంచంలోని ఈ 9 వింత రెస్టారెంట్ల గురించి తెలిస్తే ఖచ్చితంగా అక్కడి వెళ్లాలనుకుంటారు

0
798

పుర్రెకో బుద్ది, జిహ్వాకో రుచి అంటారు పెద్దలు. తినే తిండి విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. వారి అభిరుచికి తగినట్లు ఎన్నో రకాల రుచులను అందించడానికి పలు రకాల రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. కేవలం రుచిలోనే కాదు హోటల్ రూపురేఖల్లోనూ కొంతమంది డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటారు. అలాగే వడ్డించటంలోని వెరైటీయే జీవితానికి కాస్త థ్రిల్‌ అని భావిస్తాయి కొన్ని ఆతిథ్య సంస్థలు. ప్రపంచంలోని కొన్ని రెస్టారెంట్లు భిన్నమైన పద్ధతుల్లో సర్వ్‌ చేసే విభిన్నతను చాటుకుంటున్నాయి. మనం ఇప్పుడు చూడబోతున్నది అలాంటి వింతైన రెస్టారెంట్ల గురించే..!

దుబాయ్‌ ఐస్‌ రెస్టారెంట్‌: దుబాయ్‌ లో వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌ రెస్టారెంట్‌ ఎంతో చల్లదనాన్ని పంచుతుంది. ఇందులోకి అడుగుపెడితే అంటార్కిటికాలోనే ఉన్నట్లు ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడ తినడానికి అందించే అన్ని పదార్థాలు ఐస్‌తోనే లభ్యమవుతాయి.

న్యూడ్‌ రెస్టారెంట్‌ ఇన్‌ లండన్‌: 2016లో ప్రపంచంలోని మొదటి న్యూడ్‌ రెస్టారెంట్‌గా ‘ది బునియాదీ’ పేరుతో లండన్‌లో ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌లో విందు చేయడానికి చాలామంది ముందే బుక్‌ చేసుకుంటారు. ఈ రెస్టారెంట్‌లో, వెయిటర్స్‌, షెప్‌, రెస్టారెంట్‌కు విచ్చేసి అతిథులు అందరూ న్యూడ్‌గా ఉండే భోంచేస్తారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత.

అమెరికా, హార్ట్‌ ఎటాక్‌ గ్రిల్‌ రెస్టారెంట్‌: అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో ఉన్న ‘హార్ట్‌ ఎటాక్‌ గ్రిల్‌’ రెస్టారెంట్‌ విందుతో పాటు విచిత్రమైన అలవాట్లకు ఫేమస్‌. ఇక్కడ బోల్డ్‌ వెయిటర్స్‌ నర్స్‌ యూనిఫామ్‌లో స్వాగతిస్తారు. ఇక్కడి విందును ఆస్వాదించాలంటే ఆర్మ్‌ బ్యాండ్‌, హాస్పిటల్‌ డ్రెస్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే ఆహారపదార్థాలు లైన్‌ ఫ్రైజ్‌, బైపాస్‌ బర్గర్‌, కొరొనెరి హాట్‌ డాగ్ల్‌ వంటివి దొరకుతాయి.

తైవాన్‌, టాయిలెట్ రెస్టారెంట్: పిచ్చి.. పీక్స్! టాయిలెట్‌లో కూర్చొని మీరెప్పుడైనా భోజనం చేశారా? ఒకవేళ చేయాలనిపిస్తే మాత్రం తైవాన్ వెళ్లాల్సిందే. అయితే అక్కడ టాయిలెట్‌లో కూర్చోబెట్టరు, కానీ ఆ ఆకారంలో ఉండే హోటల్స్ మాత్రం కనిపిస్తాయి. తైవాన్‌లోని ఈ రెస్టారెంట్‌లో మనం అన్నం తినాలంటే టాయిలెట్ ఆకారంలో ఉండే ప్లేట్‌లో భోజనం తీసుకొస్తారు. అలాగే ఇక్కడ ఉపయోగించే ప్రతి సామగ్రి కూడా టాయ్ లెట్స్ రూపంలో ఉంటాయి. ఈ రెస్టారెంట్ కు ఒకసారి వెళ్తే మీరు కూడా లొట్టలేసుకుంటూ టాయిలెట్స్ ఆకారంలో ఉండే ప్లేట్లలో అన్నం తినొచ్చన్నమాట. చూడడానికి కొంత వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం.

కోతులే వెయిటర్స్ : సాధారణంగా మనం ఏ హోటల్‌కు వెళ్లిన మనుషులే సర్వ్ చేయడం చూస్తాం. కానీ జపాన్‌లోని కయాబుకియా టావెర్న్‌కు వెళ్తే మాత్రం ఒక వింత అనుభూతిని పొందుతాం. ఉత్సో మోమియాలోని ఈ జపనీస్ రెస్టారెంట్లో రెండు పెంపుడు కోతులు పని చేస్తున్నాయి.. మనుషులు చేసినట్లే ఇవి కస్టమర్లకు అవసరమైన వాటిని సర్వ్ చేస్తుంటాయి. వీటిని చూడడానికే పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తుండడంతో రెస్టారెంట్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది.

చీకటమ్మ చీకటి : సాధారణంగా ఎవరైనా వెలుతురులో కూర్చొని భోజనం చేయాలనుకుంటారు. కానీ చైనాకు వెళ్తే మాత్రం ఒక డిఫరెంట్ రెస్టారెంట్ చూడొచ్చు. ఈ రెస్టారెంట్ పేరే డార్క్ రెస్టారెంట్. అంటే అందులో అంతా అంధకారమే. అవును పూర్తిగా చీకట్లో కూర్చొని తినాల్సిందే. అయినా ఈ రెస్టారెంట్‌లో తినడానికి చాలామంది క్యూ కడుతున్నారట. అయితే ఇక్కడ వెయిటర్లు మాత్రం చీకట్లో కూడా అందరూ కనబడేటటువంటి కళ్ల జోళ్లు ధరిస్తారు. లేకుంటే వారికి కస్టమర్లు కనపడరు కదా మరి.

నీటి లోపల : ఎప్పుడూ భూమిమీదున్న రెస్టారెంట్లో భోజనం చేసి బోరుకొట్టిందా? అయితే ఒకసారి మాల్దీవులకు వెళ్లిరండి. అవును అక్కడ అండర్ వాటర్ రెస్టారెంట్ చాలా ఫేమస్. మాల్దీవుల్లోని హిల్టన్ రిసార్ట్, స్పాకు వెళితే సముద్ర మట్టానికి 5 మీటర్ల లోతులో ఈ రెస్టారెంట్ ఉంటుంది. అయితే ఒక్కసారి 14 మంది కస్టమర్లు మాత్రమే భోజనం చేయగలుగుతారు. అందుకే మన వంతు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి!

పక్షిగూడు రెస్టారెంట్ : ఈ రెస్టారెంట్ కూడా ఒకరకంగా ఆకాశంలో ఉన్నట్లే. అయితే చెట్టును ఆధారం చేసుకొని పక్షిగూడు మాదిరిగా నిర్మించిన ప్రత్యేక నిర్మాణంలో ఈ హోటల్స్ ఉంటాయి. వీటిని రెడ్ ఉడ్స్ ట్రీ హౌస్ అని పిలుస్తారు. వివిధ ఆకారాల్లో ఉండే ఇవి గ్రౌండ్ స్థాయి నుంచి 32 అడుగుల పైన ఉంటాయి. పిచ్చుక గూళ్ల మాదిరి గాలిలో వేలాడుతన్నట్లు ఉండే వీటిలో భోజనం చేసేందుకు జనాలు భలే ఇష్టపడుతున్నారట.

బెల్జియం, రెస్టారెంట్‌ ఇన్‌ ఎయిర్‌: బెల్జియంలోని ఈ ఒక్క రెస్టారెంట్‌ ఆకాశంలో తేలుతూ ఉంటుంది. ఇది క్రేన్‌ సహాయంతో 50 మీటర్ల ఎత్తులో ఒక డైనింగ్‌ టేబుల్‌ వేలాడుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని, పర్యాటకులు ఈ విందును ఆస్వాదిస్తుంటారు. జీవితంలో వెరైటీ కోరుకునేవారికి.. ఇలాంటి రెస్టారెంట్లు ప్రపంచవ్యాప్తంగా చాలానే అందుబాటులో ఉన్నాయి.

విదేశాలకు టూర్లు వెళితే ఈ హోటల్స్‌ను తప్పకుండా సంర్శించాల్సిందే. వైవిధ్యతను కోరుకునే వారికోసం ఇలా విభిన్న రెస్టారెంట్ల నడిపి సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here