శిద్దా రాఘవరావును ఎట్టకేలకు ఒప్పించిన టీడీపీ అధిష్టానం

0
529

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల న‌గారా మోగగానే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అభ్య‌ర్ధుల ఎంపికలో వేగం పెంచేశారు. అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే లోక్‌స‌భ బ‌రిలోకి దిగ‌నున్న అభ్య‌ర్ధుల విష‌యంలో కూడా చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కొందరు ఎంపీ అభ్య‌ర్ధుల‌ను చంద్ర‌బాబు ఫైన‌లైజ్ చేసిన‌ట్లు స‌మాచారం.

మంత్రి శిద్దా రాఘవరావు ఎట్టకేలకు అధిష్టానం నిర్ణయానికి తలొగ్గారు. ఒంగోలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి శిద్దా రాఘవరావు అంగీకరించారు. నియోజకవర్గ ప్రజలు ఎంపీగా పోటీ చేయడానికి ఒప్పుకోవడం లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయమని డిమాండ్ చేస్తున్నారని మంగళవారం శిద్దా రాఘవరావు చెప్పారు. కొందరు అనుచరులు శిద్దా ఇంటి ముందు దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేయాలని ఆందోళన కూడా చేశారు.

అయితే.. దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకు ఒంగోలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శిద్దా రాఘవరావు ఎట్టకేలకు అంగీకరించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇంకా.. పలువురు మంత్రులు ఎంపీలుగా పోటీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here