నాగచైతన్య “సవ్యసాచి” రివ్యూ

0
1958

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సవ్యసాచి’ దీపావళి కానుకగా నేడు విడుదలైంది. అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీస్ సంస్థ నాగచైతన్య కెరియర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫ్రెంట్ కథాంశంతో ప్రేమమ్ ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు మాధవన్ నెగిటివ్ రోల్ పోషించగా సీనియర్ హీరోయిన్ భూమిక కీలకపాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ‘సవ్యసాచి’ అనే డిఫరెంట్ టైటిల్‌తో సినిమా హైప్ తీసుకువచ్చిన దర్శకుడు టీజర్, ట్రైలర్‌లతో అంచనాలను రెట్టింపు చేశారు. భారీ అంచనాలతో నేడు థియేటర్స్‌లోకి వచ్చిన ‘సవ్యసాచి’ ఎలా ఉందొ ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం.

‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే ఒక కొత్త కదంశాన్ని మన టాలీవుడ్ కి పరిచయం చేస్తూ ఆ కాన్సెప్ట్ ని మన రెగ్యులర్ టెంప్లేటేడ్ ఫార్మాట్ లో పెట్టీ… ఒక రొటీన్ ఫస్ట్ హాఫ్.. కొంచం ఆకట్టుకొని సెకండ్ హాఫ్ తో కొంత ఎమోషనల్ సీన్స్ తో మనముందుకు వచ్చిన సినిమా ఈ సవ్యసాచి. నాగచైతన్య ఈ సినిమాలో తన క్యారెక్టర్ ని బాగా పెర్ఫర్మ్ చేసాడని చెప్పొచ్చు. ఇంతకు ముందు సినిమాలతో కంప్యార్ చేస్తే ఈ సినిమాలో అయన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.

హీరోయిన్ నిధి అగ్గార్వాల్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఆమె చూడడానికి చాలా బాగుంది. ఆమె పాత్రకి అంత ప్రాధాన్యం లేకపోయినా తనకున్న పరిధి మేరకు బాగానే యాక్ట్ చేసింది. ఇక మాధవన్ గారి గురించి చెప్పాలంటే.. ఈ సినిమాలో ఒక విభిన్నమైన క్యారెక్టర్ ని వండర్ ఫుల్ గా పెర్ఫర్మ్ చేసాడని చెప్పొచ్చు. మాధవన్ సినిమా మొత్తం ఉండడు కానీ ఆయన ఉన్న సీన్స్ అన్ని బాగా పెర్ఫర్మ్ చేసాడు. ఆయన డబ్బింగ్ కొంచం తేడాగా ఉందని.. కొన్ని చోట్ల అనిపిస్తుంది. కానీ అయన ఎక్సప్రెషన్స్ తో మానేజ్ చేస్తూ మొత్తానికి మాధవన్ ఈ సినిమాకి ఎంతైతే చేయగలడో అంతకు మించి చేసారని చెప్పొచ్చు.

ఇంకా ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎక్కువ లేరు. కానీ కమెడియన్స్ విషయానికి వస్తే వెన్నెల కిషోర్ కానీ, శకలక శంకర్ కానీ చాలా బాగా పెర్ఫర్మ్ చేసారు. ఫస్ట్ హాఫ్ లో శకలక శంకర్ చేసిన కామెడీ సిన్ హిలిరియస్ గా ఉంటుంది. వెన్నెల కిషోర్ కూడా అక్కడక్కడా బాగానే కామెడీ చేసాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ హైపర్ ఆది స్కిట్ పర్లేదు బాగానే ఉంది అన్నట్లు అనిపిస్తుంది కానీ… మూవీ మంచి హైప్ లో ఉన్నపుడు సడెన్ గా మధ్యలో ఇది ఎందుకు వచ్చిందిరా బాబు.. ఇప్పుడు అవసరమా ఈ సిన్ అని మనకు అనిపిస్తుంది. కాకపోతే ఆ సిన్ చాలా హిలిరియస్ గా ఉంది. ఇకపోతే నిన్ను రోడ్డుమీద చూసినది లగ్గా ఎత్తు.. అనే సాంగ్ కూడా… ఈ సాంగ్ ఇప్పుడు అవసరమా అన్నట్లు అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ కొంచం టైమ్ పాస్ చేసినట్లు అనిపించినా ఇంటర్వెల్ నుండి మూవీ చాలా బాగుంది. సెంకడ్ హాఫ్ లో మాధవన్ కి నాగ చైతన్య మధ్య వచ్చే సీన్స్ కానీ సవ్య సాచి సీన్స్ కానీ ఆ ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ వ్యాధి ని బాగానే వాడుకున్నారు. ఇంకా బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య పెర్ఫార్మన్స్ సూపర్ గా ఉంది. చివరికి మాధవన్ నాగచైతన్య మధ్య ఫైట్ కి కారణం మనకి అంతగా కన్విన్సింగ్ గా అనిపించదు. ఏంటి ఇంత సిల్లీ రీసన్ నా అని అనిపిస్తుంది. సినిమా పై ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ ని మన టాలీవుడ్ లో కమర్షియల్ గా ఇలా చుపించారన్నమాట అని బయటకు వస్తారు.

Watch Below Video For Visual Review

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here