విజయ్ సర్కార్ మూవీ రివ్యూ

0
1035

దర్శకుడు ఏఆర్ మురగదాస్, సూపర్‌స్టార్ విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన కత్తి, తుపాకీ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా ప్రేక్షకులను అలరించాయి. ఈ సక్సెస్ జోడి మూడో ప్రయత్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న సర్కార్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ సరసన కీర్తి సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్, విజయ్ స్టార్ స్టామినా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపావళీ కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ మూటగట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

విజయ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జీఎల్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఈవోగా సేవలందిస్తుంటారు. ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సుందర్ అంటే దడ. ప్రతీ దేశంలోని ప్రత్యర్థి కంపెనీలపై దాడులు చేసే ఛంఘీజ్ ఖాన్ అనే పేరు మూటగట్టుకొంటాడు. ఇలాంటి ఇమేజ్ ఉన్న సుందర్ ఇండియాకు వస్తుంటే అందరూ గజగజలాడిపోతాడు. కానీ అతడు స్వదేశానికి ఓటు వేయడానికి వచ్చాడని తెలుసుకొని ఊరట చెందుతారు. కానీ ఓటు వేయడానికి వచ్చిన సుందర్‌కు ఓ షాక్ తగులుతుంది. అప్పటికే సుందర్ ఓటు మరోకరు వేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.

తన ఓటును మరో వ్యక్తి వేసిన క్రమంలో సుందర్ ఏం చేశాడు? తన ఓటు హక్కును ఎలా సాధించుకోగలిగాడు? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడానికి సుందర్ ఏం చేశాడు. సుందర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎమ్మెల్యే కూతురైన లీలా (కీర్తీ సురేష్‌)కు సుందర్‌కు లింక్ ఏమిటీ? విదేశాల్లో ఉండే కోమలివల్లి (వరలక్ష్మీ శరత్ కుమార్) రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? కోమలివల్లికి సుందర్‌కు మధ్య వైరం ఎందుకు కలిగింది? రాజకీయాల్లో సుందర్ తన లక్ష్యాన్ని ఛేదించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సర్కార్ సినిమా కథ.

సర్కార్ సినిమా తొలిభాగంలో విజయ్ స్వదేశాగమనంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఓటు హక్కు ప్రాధాన్యతను చెప్పే అంశం ప్రేక్షకుడిని మెప్పించే విధంగా సాగుతుంది. కానీ కథ లోతుల్లోకి వెళ్లిన కొద్ది విషయం లేదనే అంశంతో ప్రేక్షకుడిని నిరాశ అవరించడం మొదలవుతుంది. ఇంటర్వెల్‌కు ముందు రెండు పాటలు, రెండు ఫైట్లు, ఓ ఆసక్తికరమైన పాయింట్ తప్ప ఏమీ కనిపించదు.

ఇక సెకండాఫ్‌లో రాజకీయ వాతావరణం వేడేక్కుతుందని భావించిన ప్రేక్షకుడికి సన్నివేశాల్లో, కథలో ఎలాంటి వినోదం, ఉద్వేగం కనిపించదు. ఇక సెకండాఫ్‌లో 30 నిమిషాల తర్వాత మరీ నాసిరకంగా సన్నివేశాలు పేర్చుకొంటూ పోవడంతో ట్రాక్ తప్పిందనే విషయం బోధపడుతుంది. దానికి తోడు రెహ్మాన్ సంగీతం మరీ పేలవంగా ఉండటంతో ఉండే ఆసక్తి తగ్గిపోతుంది. యువతను, ఓటర్లను చైతన్య పరిచే అంశాన్ని బలంగా చెప్పలేకపోవడం, సినిమా ఫార్మూలాకు అనుగుణంగా కథ నడవడంతో రొటీన్ సినిమాగా మారిపోయిందని చెప్పవచ్చు.

Watch Video For Visual Review

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here