RX 100 మూవీ రివ్యూ

0
1477

హీరో ఎవరో తెలీదు. హీరోయిన్ మొహం ఇప్పటి వరకూ పెద్దగా ఎవరూ చూసుండరు. కానీ సినిమాపై మాత్రం జనాలకు ఆసక్తి పెరిగిపోయింది. కారణం ‘ఆర్ఎక్స్100’ అనే టైటిల్. దీనికి ‘యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అనే మరో ఆసక్తికర ట్యాగ్ లైన్. చిన్న సినిమానే కానీ ఒక్క ట్రైలర్‌తో అంచనాలు పెరిగిపోయాయి. సరిగ్గా నెల క్రితం విడుదలైన ‘ఆర్ఎక్స్100’ ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ఈ అజయ్ భూపతికి ఇదే తొలి సినిమా. గురువు బాటలోనే నడుస్తూ వయోలెన్స్, రొమాన్స్‌కు భూపతి పెద్ద పీట వేశారు. ఇంతకీ ఈ రోజు రిలీజ్ అయినా ‘RX100’. సినిమా ఎలా ఉంది.. ఇప్పుడు చూద్దాం..

శివ (కార్తికేయ) తల్లిదండ్రుల లేని అనాథ. డాడీ (సింధూరపువ్వు రాంకీ) సంరక్షణలోపెరిగి పెద్దవుతాడు. డాడీ గ్రూప్‌లో కీలక సభ్యుడిగా ఉంటాడు. గ్రామ జెడ్పీటీసీ విశ్వనాథం ( రావు రమేష్)కు అండగా ఉంటారు. హుషారుగా, అమాయకంగా ఉండే శివను విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్‌పుత్) ప్రేమలోకి దింపుతుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శివ ఆమె ప్రపంచంగా జీవిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ విషయం తెలుసుకున్న విశ్వనాధ్ ఎం చేసాడు ? ఇందు ని శివ నుంచి ఎలా దూరం చేసాడు. అసలు శివ ఇందుని కలుసుకున్నాడ లేదా తనని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ.

హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, దానికి హీరోయిన్ తండ్రి ఒప్పుకోకపోవడం, హీరో అతన్ని ఎదిరించి చివరకు ప్రేయసిని దక్కించుకోవడం. చాలా సినిమాల్లో మీరు చూసిన ప్రేమకథలు ఇవే కదా! కానీ ఈ ‘RX100’ వాటికి భిన్నం. ‘యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అని ఉపశీర్షిక పెట్టుకున్నందుకు దానికి తగిన న్యాయం చేశారు దర్శకుడు అజయ్ భూపతి. పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన ప్రేమను, ప్రేమ కథను తెరపై ఆవిష్కరించారు.

సినిమా మొదటి భాగంలో హీరో కార్తికేయ దూకుడు తనంతో ఉండే క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో ఆర్ఎక్స్ 100 చిత్ర కథ మొదలవుతుంది. కార్తికేయ ఆవేశాన్ని డాడీ కంట్రోల్ చేయడం, అలాగే రావు రమేష్ ఎన్నికల్లో గెలుపొందడం లాంటి అంశాలను పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి చక్కగా ఉపయోగించుకొన్నాడు. చాలా సౌమ్యంగా ఉండే హీరో అగ్రెసివ్‌గా మారడానికి గల కారణాలను ఫ్యాష్ బ్యాక్‌తో మొదలుపెడుతాడు. ఇందు ఎంట్రీతో తొలిభాగం నాటు రొమాన్స్‌తో వేడెక్కుతుంది. యూత్‌లో జోష్ పెంచే విధంగా లిప్‌లాక్‌లతో సన్నివేశాల్లో కాకపుడుతుంది. ఇలా సాగుతున్న సినిమాకు ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

తొలి భాగం చూస్తున్నంతసేపు ఇది మామూలు సినిమానే అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఏం సినిమారా..! అనకమానరు. సెకండాఫ్‌ను దర్శకుడు అంత బాగా తెరకెక్కించారు. వాస్తవానికి సినిమాను నిలబెట్టే ట్విస్ట్ ఒకటి సెకండాఫ్‌లో వస్తుంది. అదేంటో తెలిస్తే సినిమా చూడాలనే ఆసక్తే పోతుంది. అందుకే దాని గురించి ప్రస్తావించడంలేదు. ఒక నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సినిమా ఆఖర్లో తెరపై వేశారు. సెకండాఫ్ చూసిన తరవాత.. ఫస్టాఫ్‌లో చూపించిన రొమాన్స్ నిజమే కదా అనిపిస్తుంది. ఫస్టాఫ్ ప్రేక్షకుడికి కాస్త బోర్ కొట్టించినా.. సెకండాఫ్ మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా యువతకు మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది.

ఈ మూవీ తో హీరో గా పరిచయం అవుతున్న కార్తికేయ ఇంటెన్స్ రోల్ లో బాగానే నటించాడు, అక్కడక్కడా విజయ్ దేవరకొండ ని ఇమిటేట్ చేసిన గాని పర్వాలేదు అనిపించాడు. కాని ఎమోషనల్ సీన్స్ లో మాత్రం కార్తికేయ ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. యాక్షన్ సీన్స్ లో మాత్రం కార్తికేయ బాగా నటించాడు. అలాగే హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ విషయానికి వస్తే కేవలం గ్లామర్ ని వలకించడానికి మాత్రమే సినిమాలో ఉంది అనిపిస్తుంది. కథలో పాయల్ ది ముఖ్యమైన క్యారెక్టర్ అయిన కూడా తన నటనతో ఆ క్యారెక్టర్ ని అంతగా పడించలేకపోయింది ఈ భామ.

ఇక మూవీ లో మరో మెయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే రావు రమేష్ గురించి మాట్లాడుకోవాలి. రావు రమేష్ తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు, ఇంకా చెప్పాలి అంటే కొన్ని సీన్స్ లో రావు రమేష్ అలా ఒదిగిపోయాడు అనిపిస్తుంది. అలాగే “సింధూర పువ్వు” సినిమాతో తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రాంకి ఈ సినిమాతో మళ్ళి తెలుగు లో చాలా కాలం తరువాత నటించిన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు. గాడ్ ఫాదర్ లాంటి పాత్రను అవలీలగా రక్తికట్టించాడు. భావోద్వేగాల మధ్య సాగే పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. రొటీన్‌కు భిన్నంగా అద్భుతమైన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు.

సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదు. సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అజయ్ భూపతి తన తొలి చిత్రంతోనే తనదైన మార్క్ చూపించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయిన చైతన్ భరద్వాజ్ కూడా తన సంగీతం తో ఆకట్టుకున్నాడు. “పిల్లా రా” అనే సాంగ్ అయితే వన్ అఫ్ ది బెస్ట్ సాంగ్ ఇన్ ఆల్బం గా చెప్పుకోవచ్చు. మొత్తానికి సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పలేం.. కానీ యువతకు మాత్రం కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇదో కొత్తరకం విఫల ప్రేమకథ. ఇందులో విలన్ హీరోయిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here