రెడ్ మి కి పోటీగా అతి తక్కువ ధరలో రియల్ మి 3 ధరెంతో తెలుసా?

0
344

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ RealMe .. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. అందుబాటు ధరలో మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు రియల్‌మి 3. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఈ ఫోన్‌ను + లాంచ్ చేసింది. రియల్‌మి 2కు updated వెర్షన్‌గా Real Me 3 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి entry ఇచ్చింది.

రియల్‌మి 3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999 నుంచి ప్రారంభమౌతోంది. 3 జీబీ ర్యామ్, 32 GB మెమరీ variant కు ఇది వర్తిస్తుంది. ఇక 4 GB ర్యామ్, 64 GB మెమరీ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. రియల్‌మి 3 స్మార్ట్‌ఫోన్ మార్చి 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో అందుబాటులో ఉండనున్నాయి.

ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో Media Tech హీలియో P70 12NM ప్రాసెసర్, 6.2 inches స్క్రీన్, 13 MP + 2 MP డ్యూయెల్ రియర్ కెమెరా, 13 MP ఫ్రంట్ కెమెరా, 4,230 MAH బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. కాగా మరోవైపు రియల్‌మి అన్ని ఫోన్లకు జూన్ కల్లా ఆండ్రాయిడ్ పై OS update వస్తుందని కంపెనీ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here