సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? అయితే ఇవి ఖచ్చితంగా తెలుసుకోండి

0
388

మనదేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపయోగించిన ఫోన్ లకు సంబంధించిన ఆసక్టికర డీల్స్ ఇంటర్నెట్‌లో (OLX & Quikr) హల్‌చల్ చేస్తున్నాయి. పాత స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు చేసే విషయంలో మీకు కొంచం అవగాహన కలిగి ఆలోచనాత్మకంగా వ్యవహరించినట్లయితే డబ్బు ఆదా అవటంతో పాటు మంచి ఫోన్ మీ చెంతకు చేరుతుంది. ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం…

OLX, Quikr వంటి క్లాసిఫైడ్ సైట్స్ లో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసేముందు సంబంధిత సెల్లర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకోబోయే సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ ఏ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది?, స్మార్ట్‌ఫోన్ మోడల్ ఏంటి..? తరువాతి వర్షన్ కి అప్‌డేట్ అయ్యే అవకాశం ఉందా..? ర్యామ్ సామర్ధ్యం ఎంత..? ప్రాసెసర్ వేగం ఎంత..? ఇలాంటి వివరాలను ముందుగా ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే రివ్యూలు ద్వారా చెక్ చేసుకోండి. సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు ఆ ఫోన్‌కు సంబంధించిన బిల్స్ ఇంకా ఆ ఫోన్ తో పాటు వచ్చిన యాక్సెసరీస్ ఇంకా IMEI నెంబర్ ఖచ్చితంగా ఉందోలేదో చెక్ చేసుకోండి.

భవిష్యత్‌లో మీకు ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మీకు పాత స్మార్ట్‌ఫోన్‌ను అమ్ముతున్న వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలను ఆరా తియ్యండి. అతనికి మంచి రెప్యుటేషన్ ఉంటేనే డీల్ ఓకే చేయండి. మీరు ఎంపిక చేసుకోబోయే సెకండ్ హ్యాండ్ ఫోన్ ను ఒకటికి రెండుసార్లు బాగా పరివీలించండి. Display, కెమెరా, కీప్యాడ్, చార్జింగ్ పోర్ట్, సిమ్ స్లాట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వంటివి బాగా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫోన్ స్పీకర్స్ ఇంకా సౌండ్ క్వాలిటీని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి.

మీరు ఎంపిక కేసుకునే సెకండ్ హ్యాండ్ ఫోన్ బ్రాండెడ్ క్వాలిటీదై ఉంటే బాగుంటుంది. మీరు కొనదలుచుకున్న సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఇప్పుటికీ మార్కెట్లో లభ్యమవుతున్నట్లయితే ఆన్‌లైన్ మార్కెట్లో ఆ ఫోన్ ఇంతకీ వస్తుందో చెక్ చేసుకోండి. వాటిలో ఏదైనా డీల్ మీకు నచ్చినట్లయితే సెకండ్ హ్యాండ్ మొబైల్ కి బదలుగా కొత్త మొబైల్ నే పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here