రాక్షసుడు రివ్యూ.. బెల్లం బాబు హిట్ కొట్టాడా? లేదా?

0
809

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన క్రైమ్ జానర్ థ్రిల్లర్ చిత్రం “రాక్షసుడు”. తమిళ్ లో “రాట్సాసన్” గా తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. ఆ సినిమా కోసం తెలిసిన ప్రతీ ఒక్కరు ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి చూద్దాం..

కథ :కథలోకి వెళ్లినట్టయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (అర్జున్ కుమార్) అతని కుటుంబ పరిస్థితుల రీత్యా ఒక పోలీస్ గా మారాల్సి వస్తుంది. ఇదే నేపథ్యంలో అనూహ్యంగా కొంతమంది అమ్మాయిలు మిస్సవుతు హత్యకు గురవుతుంటారు. అలాగే హీరోయిన్ అనుపమ (కృష్ణవేణి) టీచర్ గా పని చేసే స్కూల్ లో ఒక అమ్మాయి కూడా కూడా ఇలాగే మిస్సవుతుంది. అసలు ఈ హత్యలు అన్ని ఎవరు చేస్తున్నారు? ఏ కారణం చేత చెస్తున్నారు? దీని వెనుకున్న మిస్టరీ ఏమిటి? ఈ సవాళ్ళను హీరో అసలు ఎలా ఛేదించగలిగాడు అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :తాను హీరోగా మారినప్పటి నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏదొక రకంగా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే అటు మాస్ క్లాస్ మరియు కొన్ని వైవిధ్యభరిత చిత్రాలను కూడా చేసారు.అందులో భాగంగానే తమిళ్ ఎలాంటి అంచనాలు కూడా లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న “రాట్సాసన్” వంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఒప్పుకొని మరో ముందడుగు వేశారు.

ఈ సినిమా మొదలయ్యినప్పటి నుంచి కూడా ఆసక్తికరంగా ప్రేక్షకుడు కూర్చున్న స్థానం నుంచి కదలనివ్వకుండా కొనసాగుతుంది. కథానుసారం వచ్చే ట్విస్టులు అలాగే సస్పెన్స్ సినిమా చూసే ప్రేక్షకుడికి మరింత ఆసక్తిని అందజేస్తాయి. అలాగే ఒక్క సస్పెన్స్ మాత్రమే కాకుండా కథతో కూడిన ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు చూసినట్లయితే క్రైమ్ థ్రిల్లర్ కాస్తా హార్రర్ థ్రిల్లర్ గా మారిందా అన్న అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సినిమా సినిమాకు తనలోని ఉన్న నటనా పరిధిని మరింత మెరుగు పరుస్తున్నారు.

ఈ సినిమాలోని రాజీవ్ మరియు శ్రీనివాస్ ల మధ్య వచ్చే ఒక ఎమోషనల్ సీన్ ను అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోసం కొత్తగా చెప్పక్కర్లేదు. మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ కథకు అసలు బలం అయినటువంటి విలన్ పాత్ర చేసిన శరవణన్ కోసం మాట్లాడి తీరాల్సిందే. అతని మొహం కూడా కనిపించకుండా తనలోని ఉన్న విలనిజాన్ని అత్యద్భుతంగా చూపిస్తారు. ఇక దర్శకుని పనితనానికి వచ్చినట్టయితే తమిళ్ వెర్షన్ ను ఏమాత్రం చెడగొట్టకుండా తెలుగులో రమేష్ వర్మ చక్కగా టేకింగ్ తీసుకున్నారు.

ఈ సినిమాను చూసే ప్రేక్షకుడు మరింత సహజత్వం ఫీల్ అవ్వడాన్ని అదే సంగీత దర్శకుణ్ణి మరియు విలన్ పాత్రదారున్ని తీసుకొని మంచి పని చేసారు. అలాగే కథనంలో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసుకెళ్లే విధంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటారు. అయితే తమిళ్ వెర్షన్ కు తెలుగు వెర్షన్ కు పెద్ద మార్పులు చేర్పులు వంటివి చెయ్యకపోవడం ఈ సినిమాను ఇప్పటికే తమిళ్ వెర్షన్ లో చూసేసిన తెలుగు ప్రేక్షకులకు పెద్ద గొప్పగా ఏమి అనిపించదు.

రెండు భాషల్లోనూ సంగీతం సమకూర్చిన జిబ్రాన్ కోసం మాట్లాడకపోతే ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ నే మిస్ చేసిన వాళ్లమవుతాం. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రధాన హైలైట్ ఏమన్నా ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. జిబ్రాన్ ఇచ్చిన ఈ సంగీతం వల్ల సినిమా చూసే ప్రేక్షకుడే తెలికుండా సినిమాలో లీనం అవుతాడు. అలాగే కథానుసారం ఇచ్చిన ట్యూన్స్ కూడా బాగుంటాయి. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ స్క్రీన్ ప్లే కు తగ్గట్టుగా సహజంగా బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here