మోడీ ప్రవేశపెట్టిన కేంద్ర రైతుబంధు పథకానికి మీరు అర్హులా? అనర్హులా? చెక్ చేసుకోండి ఇలా

0
435

తెలంగాణ రైతుబంధు తరహాలో ప్రధానమంత్రి మోడీ కూడా అలంటి పథకం ప్రవేశపెట్టారు. PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుపై కేం ద్రం వేగం పెంచింది. ఈ పథకం మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు స్పష్టంచేసింది. అర్హుల పేర్లు జాబితాలో ఎవరి పేరైన లేకుంటే దరఖాస్తు చేసుకోవాలి అని తెలిపింది. ఈ నెల 25నాటికి రాష్ట్రంలో ఉన్న అర్హులైన చిన్న, సన్నకారు రైతుల జాబితాను సిద్ధం చేసి పీఎం-కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్రం ఆదేశించింది.

మొదటి విడుత సొమ్మును ఏడాదిలో ఎప్పుడైనా పొందేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25 తర్వాత వివరాలు అప్‌లోడ్ చేసినా ఏడాదిలో ఎప్పుడైనా సొ మ్మును ఖాతాలో వేస్తారు. ఐదెకరాల్లోపు ఉన్న ఒక కుటుంబం మాత్రమే రూ. 6వేలు పొందడానికి అర్హులుగా నిర్ధారించారు. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని ముఖ్యాంశాలు..

అనర్హులు
ఉన్నతాదాయవర్గాల వారు, వేర్వేరు ప్రాంతాల్లో వివిధ సంస్థల కింద ఐదెకరాల లోపు భూమి ఉన్న వారు, రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వాళ్ళు అనర్హులు. తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ తాజా, మాజీ చైర్మన్లు , ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులు. నాలుగో తరగతి ఉద్యోగులకు మినహాయింపు. రూ.10వేల మించి పింఛన్ తీసుకునే ఉ ద్యోగులు, గతేడాది ఇంకాంటాక్స్ చెల్లించిన వారు కేంద్ర రైతుబంధు పథకానికి అనర్హులు.

సొంత ధ్రువీకరణే కీలకం..
లబ్ధిదారులే సొంత ధ్రువీకరణ ఇవ్వాలి. తప్పుడు సమాచారమిస్తే సొమ్ము వాపస్ తీసుకోవటంతోపాటు చట్టపర చర్యలు. ఐదెకరాల లోపు భూమిని వివిధ చోట్ల ఉండి ఉన్నా, ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటున్నా వారికి కూడా అందజేస్తారు. లబ్ధిదారుల డాటాబేస్‌ను సమగ్రంగా పంపాలి. గ్రామం పేరు, వయస్సు, సామాజికవర్గం,బ్యాంకు ఖాతా, ఆధార్, సెల్‌నంబర్లు కూడా పంపాలి.

రాష్ట్రస్థాయిలో నోడ్ వ్యవస్థ ..
పథకం పర్యవేణకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో కమిటీలు వేస్తారు. జాతీయ స్థాయిలో సమీక్ష కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సమీక్ష కమిటీలు ఏర్పడుతాయి. కేంద్రస్థాయిలో ప్రాజెక్టు మానిటర్ యూ నిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేస్తారు. దానికి సీఈవో ఉంటారు. ఇది పథకంపై ప్రచారంచేస్తుంది. అవగాహన కల్పిస్తుంది. పథకం అమలు పర్యవేక్షణకు ఒకనోడ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. ఏదో ఒక ప్ర భుత్వశాఖకు ఈ బాధ్యత అప్పగించాలి. వారికి ప్రోత్సాహకాలు ఇస్తారు. జిల్లాస్థాయిలో పీఎంకేఎస్‌వై పోర్టల్‌కు లా గిన్ అవకాశం కల్పిస్తారు. రైతులందరికీ వివరాలు అందుబాటులో ఉంటాయి. ఏ బ్యాంకు ద్వారా డబ్బును అందజేయా లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here