పోలవరం విషయంలో కీలక అడుగువేసిన చంద్రబాబు..!

0
304

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన జ్యోతి… ఆశాదీపం పోలవరం ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. నిర్మాణ కాంట్రాక్టు నవయుగా దక్కించుకున్న తర్వాత పోలవరం పనుల్లో వేగం పెరిగింది. చైనాలోని త్రీ గోర్జెస్ డాం నిర్మాణ రికార్డులతో పోటీ పడి మరీ ఇక్కడ పనులు సాగుతున్నాయి. ఒకవైపు పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు… మరోవైపు కేంద్ర ప్రభుత్వ కొర్రీలు వెరసి ఈ ప్రాజెక్టు పనుల విషయంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మొండి ధైర్యంతో పనులను ఎలాగైనా కొనసాగించాలని చంద్రబాబు పట్టిన పట్టుదలే ఈ రోజున ప్రాజెక్టు నిర్మాణ పనులు అసమాన వేగంతో పూర్తవుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి రైతులకు నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో సాగుతున్న పనులును ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ పైలాన్‌ను ఆవిష్కరించారు. డయాఫ్రమ్ వాల్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని అన్నారు. పనులు త్వరత్వరగా పూర్తి చేస్తున్న పోలవరం ఇంజనీర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తనకు సోమవారం పోలవారమేనని అన్నారు. 63 వారాలు వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ చేశానని.. ఇంత కష్టపడుతుంటే… వైసీపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

పోలవరం పూర్తి చేయడం తన జీవితాశయమని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎక్కువ భాగం భూమిలోనే ఉంటుందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు డయాఫ్రమ్ వాల్‌ కీలకమని అన్నారు. ఒక్క రోజులో 60 వేల బస్తాల సిమెంట్‌ వాడారన్నారు. నవయుగ కంపెనీ ప్రాజెక్టు నిర్మాణంలో రికార్డులను అధిగమిస్తోందని సీఎం కొనియాడారు. నవయుగ కంపెనీ పాత రేట్లకే పనులు చేసేందుకు ముందుకు వస్తే.. వైసీపీ కావాలనే అసత్య ఆరోపణలు చేస్తోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆదివారం పోలవరం నిర్మాణ పనుల్లో అరుడైన రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది. అంతేకాదు… త్వరలో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ రికార్డునూ అధిగమించే లక్ష్యంతో దూసుకుపోతుంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. ఇప్పటిదాకా ఇదే జాతీయ రికార్డు. దీనిని ఆదివారం పోలవరం ప్రాజెక్టు అధిగమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here