RX 100 హీరోయిన్ గురించి మీకు తెలియని నమ్మలేని నిజాలు

0
102

తెలుగులో లేటెస్ట్ గా రిలీజ్ అయిన RX100 మూవీలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోయటమే కాదు మతి పోయేలా లిప్ లాకులు చేసింది పాయల్ రాజపుత్. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ ఉత్తరాది భామ టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అసలు ఈ సినిమా ట్రైలర్ తోనే ఆడియన్స్ పిచ్చెక్కి పోయారంటే అతిశయోక్తి కాదు.అర్జున్ రెడ్డి లో ఒకటి రెండు లిప్ లాకులకే అబ్బా అనుకున్నారు. RX100 మూవీలో మోతాదుకు మించిన సీనులతో పాయల్ రాజపుత్ రగిల్చిన వేడి అంతా ఇంతా కాదు. రివ్యూలలో సైతం పాయల్ కే మార్కులు వేస్తున్నారు సినీ క్రిటిక్స్. దాన్ని బట్టే అమ్మడు ఈ స్థాయిలో బోల్డ్ గా యాక్ట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. 28 ఏళ్ల పాయల్ రాజపుత్ కి టాలీవుడ్లో ఇది తొలి చిత్రమే.

పాయల్ స్వస్థలం హర్యానాలోని ఫరీదాబాద్. 1990 జులై 30 న జన్మించింది. తల్లిదండ్రులు మధ్య తరగతి వ్యక్తులు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన పాయల్ నటనపై ఆసక్తితో యాక్టింగ్ కోర్సులో డిప్లొమా చేసింది. మొదట టీవీ సీరియల్స్ లో ట్రై చేసిన ఈ హర్యానా బేబీ సప్నోస్ బరోనైనా అనే సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ స్టార్ ప్లస్ ఛానెల్ లో ప్రసారమైంది. ఆ తరువాత మహాకుంబ్ అనే ఫాంటసీ బేస్ సీరియల్ లో మాయ పేరుతో అందరి దృష్టిని ఆకర్షించింది.

సీరియల్స్ తో ఎంతో ఫేమస్ అయిన ఈ స్లిమ్ బ్యూటీకి పంజాబీ చిత్ర పరిశ్రమ ఘన స్వాగతం పలికింది. ప్రస్తుతం పంజాబీ ఫిల్మ్ ఇండస్ట్రీ పాలీవుడ్లో పాయల్ అగ్ర శ్రేణి హీరోయిన్ అంటే ఆశ్చర్యం వేస్తుంది. బోల్డ్ గా నటించే హీరోయిన్ కోసం చూస్తున్న RX100 చిత్ర యూనిట్ కి పాయల్ కనిపించింది. కథ వినగానే ఎంతో ఇంప్రెస్స్ అయిన పాయల్ లిప్ లాకులకు సైతం ఓకే చెప్పేసింది. ఈ సినిమా తరువాత టాలీవుడ్లో ఎన్ని ఛాన్సులు వస్తాయో తెలియదు కానీ అమ్మడికి పంజాబీ చిత్ర పరిశ్రమలో మాత్రం అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

 

మొదటి నుంచి పాయల్ కి కుటుంబ ప్రోత్సాహం మెండుగా ఉంది. వారి అండతోనే సీరియల్స్ నుంచి సినిమాల వరకు అన్నిటిని బ్యాలన్స్ చేసుకుంటూ వస్తుంది. గత కొన్నాళ్లుగా ముంబైలో ఉంటున్న పాయల్ తన చిన్ననాటి మిత్రుడు సౌరబ్ డింద్రితో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్కూల్ డేస్ నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాదు వారిద్దరి కుటుంబాలు ఎంతో సన్నిహితంగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here