గోపీచంద్, మెహ్రీన్ “పంతం” మూవీ రివ్యూ

0
1402

ఈమధ్యన గోపీచంద్ కి అస్సలు కాలం కలిసి రావడం లేదు. గత కొన్నాళ్లుగా రొటీన్ రోడ్డ కొట్టుడు అనే టైప్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మాస్ మాస్ అంటూ గోపీచంద్ తన కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్నాడు. యావరేజ్ హిట్స్ ఇచ్చే సంపత్ నంది కూడా గోపిచంద్ ని కాపాడలేకపోయాడు. ఇక గోపీచంద్ సినిమాలకు మార్కెట్ విపరీతంగా పడిపోయింది. ఆక్సిజన్, గౌతమ్ నంద, ఆరడుగుల బుల్లెట్ వంటి సినిమాలతో ప్లాప్స్ మీదున్న గోపీచంద్ సరైన కథలు ఎంచుకోకపోవడంతో విజయానికి దూరంగా ఉన్నాడు.

గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం పంతం. చక్రవర్తి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కె.కె. రాధామోహన్ నిర్మించారు. గోపిచంద్ 25వ సినిమాగా వస్తున్న ఈ పంతంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో.. గోపిచంద్ హిట్ కలని నిజం చేసిందో లేదో ఈనాటి మన సమీక్షలో చూద్దాం.

గోపీచంద్ విక్రాంత్ అనే క్యారెక్ట‌ర్‌లో న‌టించాడు. హీరో త‌న గ్యాంగ్‌తో క‌లిసి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల ఇళ్ల‌ల్లో దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే మినిస్ట‌ర్ నాయ‌క్ (సంప‌త్‌) ఇంట్లో పెద్ద దొంగ‌త‌నం చేస్తాడు. మినిస్ట‌ర్ ఇంట్లో జ‌రిగిన ఈ దొంగ‌త‌నంపై పోలీసులు సీరియ‌స్‌గా విచార‌ణ చేస్తున్న క్ర‌మంలోనే విక్రాంత్ గ్యాంగ్‌లో కొంద‌రు దొరుకుతారు. ఈ క్ర‌మంలోనే ఈ గ్యాంగ్‌ను లీడ్ చేస్తోంది విక్రాంత్ అని తెలుసుకున్న మినిస్ట‌ర్ నాయ‌క్‌… అత‌డి గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. అస‌లు విక్రాంత్ ఇలా రాజ‌కీయ నాయ‌కులను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? దీని వెన‌క ఉన్న క‌థేంటి ? అన్న‌దే పంతం సినిమా స్టోరీ.

మరి ఈ స్టోరీ చూస్తుంటే ఎప్పుడో.. మాస్ మహారాజ్ రవితేజ నటించిన కిక్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో రవితేజ ఉల్లాసంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కిక్ కోసం నలుగురిని ఆదుకోవడానికి దొంగతనాలు చేస్తూ హాస్యం పండిస్తాడు. ఈ సినిమాలో కూడా గోపీచంద్ త‌న గ్యాంగ్‌తో క‌లిసి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల ఇళ్ల‌ల్లో దొంగ‌త‌నాలు చేస్తాడు. అస‌లు గోపీచంద్ ఇలా రాజ‌కీయ నాయ‌కులను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? అనే దానిని ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి చాలా బాగా ప్రెసెంట్ చేసాడు.

గోపీచంద్‌కు చాలా రోజుల త‌ర్వాత పంతం రూపంలో ఒక మంచి సినిమా వ‌చ్చింది. మంచి సోష‌ల్ మెసేజ్‌తో పాటు ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి క‌థ‌నాన్ని న‌డిపించ‌డంలో స‌క్సెస్ అయ్యారు అనే చేప్పాలి. కొన్ని వేస్ట్ సీన్లు ఉన్నా కామెడీ, యాక్ష‌న్‌, సోష‌ల్ మెసేజ్‌, పొలిటిక‌ల్ యాంగిల్స్ సినిమాను నిల‌బెట్టాయి. గోపీచంద్ డిఫ‌రెంట్ వేరియేష‌న్ ఉన్న పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. యాక్ష‌న్ సీన్ల‌లోనూ, డైలాగ్ డెలివ‌రీలోనూ గోపీచంద్ న‌ట‌న సినిమాకు హైలెట్‌. ఇక హీరోయిన్ మెహ‌రీన్ పాత్ర వ‌ర‌కు జ‌స్ట్ ఓకే. నిర్మాత రాధామోహ‌న్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా ఎక్కడ సినిమా క్వాలిటీ తగ్గకుండా తెర‌కెక్కించారు.

సినిమా మొదటి భాగం అంతా సరదాగా సాగుతుంది. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ చేస్తుంది. అయితే అదే విధంగా సెకండ్ హాఫ్ కొనసాగించలేదు. రెండో భాగం కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. కథలో అనవసరమైన సన్నివేశాలు చేర్చి ఇంకాస్త సాగదీసినట్టు చేశాడు దర్శకుడు. ఎంచుకున్న కథను కమర్షియల్ పంథాలో చెప్పాలన్న ఆలోచనతో అలా చేసి ఉండొచ్చు. కోర్టు లో క్లైమాక్స్ సన్నివేశం.. సమాజంలో జరుగుతున్న లంచగొండి తనం, రాజకీయ నాయకుల అక్రమాల గురించి గోపిచంద్ కొట్టే డైలాగ్స్ థియేటర్లో విజిల్స్, చప్పట్లు మారుమోగాయి. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడియెన్స్ ను అలరిస్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here