యూట్యూబ్ స్టార్ పక్కింటి కుర్రాడు గురించి మీకు తెలియని విషయాలు

0
371

ఒకప్పటితో పోలిస్తే నేటి యువతకు ఉపాధి అవకాశాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఒకరి ఫై ఆధారపడకుండా స్వయంశక్తితో సంపాధించడానికి ఇష్టపడుతున్న యువతీ యువకులు నూతన ఆవిష్కరణలు, వినూత్నమైన ఐడియాలతో ముందంజ వేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాకా యూత్ కి సరికొత్త అండ దొరికినట్లయింది. పేస్ బుక్, ట్విట్టర్ వంటివి ప్రచారానికి బాగా ఉపయోగపడుతుండగా నాలుగు డబ్బులు సంపాదించాలంటే అందుకు యూట్యూబ్ కల్పతరువులా కనిపిస్తుంది.

ఇప్పుడున్న జెనెరేషన్లో ప్రతిఒక్కరు మొబైల్ లో యూట్యూబ్ వాడడం సర్వసాధారణం అయింది. అయితే ఈ మధ్యన యూట్యూబ్ లో “పక్కింటి కుర్రోడు” అనే ఛానల్ వీడియోస్ బాగా పాపులర్ అవుతున్న విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ వీడియోస్ లో పక్కింటి కుర్రాడు గా అతను చెప్పే విషయాలు కొన్ని బోల్డ్ గా ఉన్న ప్రతి వీడియో చివరికి ఎదో ఒక మంచి మెసేజ్ ఇవ్వడం వలన యూత్ ఆ వీడియోస్ కు బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ప్రతి వారం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకోని అందులో ఎదో ఒక మెసేజ్ ఇస్తూ వూవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు ఈ పక్కింటి కుర్రాడు.

అయితే ఈ పక్కింటి కుర్రాడుగా కనిపిస్తున్న అతని పేరు “కోలా చందు సాయి”. ఇతనిది రాజమండ్రి. 2007 లో రాజమండ్రి లోని గౌతమ్ మోడల్ స్కూల్ లో 10th వరకు చదివాడు. తరువాత ఇంటర్ హైదరాబాద్ లోని నారాయణ జూనియర్ కాలేజ్ లో చదివాడు. తరువాత సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఫిల్మ్ & టెలివిషన్ ఇన్సిట్యూట్ లో చేరి శిక్షణ పొందాడు. దాని తరువాత సినిమాలలో అవకాశాలకోసం 3 సంవత్సరాలు ప్రయతించాడు. ఆలా ప్రయతింస్తున్న సమయం లోనే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసాడు.. ఆలా చేస్తూ ఉండగా టమాడా మీడియా వాళ్ళు చందు సాయి ని పక్కింటి కుర్రోడు గా పరిచయం చేసారు. అయితే తానే సొంతగా కష్టపడి స్క్రిప్ట్ రాసుకొని ప్రెసెంటేషన్ లో తనకంటూ ఒక యాటిట్యూడ్ మరియు వేరియేషన్ ని మైంటైన్ చేస్తూ… తెలుగు యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్ కి 4 లక్షల 75 వేలమంది subscribers ఉన్నారంటే మనోడి ఫాలోయింగ్ ఏరేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here