రవితేజ నేల టిక్కెట్టు మూవీ రివ్యూ

0
1445

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ కళ్యాణ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్లో తాళ్లూరి రాం ఈ సినిమాను నిర్మించగా శక్తికాంత్ మ్యూజిక్ అందించాడు. కొత్త అమ్మాయి మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. రాజా ది గ్రేట్ హిట్ తర్వాత టచ్ చేసి చూడు నిరాశ పరచగా ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేయడంతో సినిమా టాక్ బయటకు వచ్చింది.

 

కథ : వైజాగ్ లో హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉండే పాత్రలో రవితేజ కనిపిస్తాడు. అయితే అతను హైదరాబాద్ రాగానే ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటాడు. జగపతి బాబు సీఎం కావాలని ఎన్నో కుట్రలు చేస్తుంటాడు. ఆ కుట్రలు బయటపెట్టే తరుణంలో కొందరిపై దాడులు జరుగుతాయి. ఆ తరువాత రవితేజ అతన్నీ ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? జగపతి ప్రణాళికలు ఏమిటి? చివరికి విలన్ పై హీరో ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అనేది తెరపై చూడాలి.

 

ఈ రోజుల్లో కొందరు దర్శకులు కథ కొత్తగా ఉండేలా చూసుకుంటుంటే కమర్షియల్ ఎలిమేట్స్ ని మిస్ చేయనివ్వడం లేదు. అలానే ఈ సినిమాలో కెప్టెన్ కళ్యాణ్ మంచి మెస్సేజ్ తో పాటు కమర్షియల్ పాయింట్స్ ని కూడా మిస్ అవ్వనివ్వలేదు. కామెడీ, యాక్షన్ సీన్స్ అలాగే ఎమోషనల్ సీన్స్ తో స్క్రీన్ ప్లే నడుస్తుంది. రవితేజ తన స్టైల్ తో కథను ముందుకు నడిపించిన విధానం బావుంది. సెకండ్ హాఫ్ లో జగపతి బాబుకి సంబందించిన పొలిటికల్ ట్విస్ట్ లు అలరిస్తాయి.

 

సెకండాఫ్ కథనం కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బానే ఉన్నా కూడా కొన్ని సీన్స్ లలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బావుండేది. చాలా వరకు కొన్ని సీన్స్ బోరింగా అనిపిస్తాయి. సినిమా క్లైమాక్స్ కూడ కొత్తదనం ఏమి ఉండదు. పాటలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయాయి.

 

సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు దర్శకుడు ఏమి చెప్పదల్చుకున్నాడు అనే ప్రశ్న మనకు వస్తుంది. సినిమాలో వచ్చే దాదాపు 80% సీన్లు చాలా సినిమాలలో మనం చూసి ఉంటాం. రవి తేజ సైతం చాలా క్లూ లెస్ గా కనిపించాడు. కొత్త అమ్మాయి మాళవిక శర్మ గురించి చెప్పుకోటానికి ఏమి లేదు. కథ లో చాలా పాత సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు సహనం పరీక్షించేలాగా కథ నేరేషన్ ఉంటుంది. సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండ్ హాఫ్ లో నరకం అంచుల్లోకి తీసుకెళ్లి వదిలేస్తాడు. ఏ సీన్ ఎందుకు వస్తుంది, ఏ సీన్ ఎందుకు పోతుంది, అసలు ఈ సినిమా పర్పస్ ఏంటి అని అర్ధం చేస్కుంటూ నిద్రలోకి వెళ్ళిపోతారు.

 

సినిమాలో ప్లస్సుల విషయానిఒస్తే రవితేజ నటన, మాళవిక శర్మ అందాలు, కెమెరా వర్క్ కాస్త బాగుంది. చివరిగా రెండు వరుస సక్సెస్ లను అందుకున్న కళ్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ మిస్ అయ్యాడని చెప్పొచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here