నారా లోకేష్ పోటీ చేసే స్థానం ఎట్టకేలకు ఖరారైంది !

0
306

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా పార్టీల్లో కీలక నేతలు పోటీచేసే స్థానాలపై ఉత్కంఠ నడుస్తోంది. టీడీపీలో నారా లోకేష్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే అంశం ఆసక్తిగా మారింది. లోకేష్‌ను ఉత్తరాంధ్ర నుంచి పోటీచేయించాలని భావిస్తున్న చంద్రబాబు.. విశాఖజిల్లా భీమిలి నుంచి బరిలోకి దించుతారని ప్రచారం జరిగింది. మళ్లీ మారిన సమీకరణాలతో.. తాజాగా మరో నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది.

మంత్రి నారా లోకేష్‌ పోటీ చేసే నియోజకవర్గంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. నిన్నమొన్నటి వరకూ విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయనున్నారని వార్తలొచ్చినప్పటికీ అధిష్టానం వేరే స్థానాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. నేడు పలు దఫాలుగా చర్చించిన అనంతరం టీడీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. రేపు విడుదలయ్యే జాబితాలో లోకేష్‌ పేరు ఉంటుందని సమాచారం.

మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలోనే లోకేష్‌కు ఓటు ఉండటం విశేషం. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికే మళ్లీ టికెట్ ఖరారైందని వైసీపీ వర్గాల భోగట్టా. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి గంజి చిరంజీవి పోటీ చేశారు. కేవలం 12ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవిపై విజయం సాధించారు.

The constituency of Nara Lokesh comprising the constituency was finally cleared. Even though the news was reported from Visakhapatnam yesterday, Visakhapatnam has fixed another position. Nara Lokesh is contesting from Mangalgiri in Guntur district. This decision was taken by TDP High Command after discussing various demands today. There is information on locks name in the list of tomorrow’s release.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here