కళ్యాణ్ రామ్, తమన్నా ల “నా నువ్వే” మూవీ రివ్యూ

0
1690

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రొటీన్ సినిమాలకు భిన్నం గా 180 మూవీ తీసిన డైరెక్టర్… గ్రేట్ యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర డైరక్షన్ లో వచ్చిన సినిమా నా నువ్వే. కళ్యాణ్ రామ్ ను లవర్ బోయ్ గా సరికొత్తగా చూపించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. PC శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

మనసులు కలిసాయి… నీడలు కలిసాయి… మరి వారిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారా? ఆమె ప్రేమ ఊహా? లేక ఊహ కి అందని ప్రేమ? ఇంతకీ ఆమె ప్రేమిస్తుంది ఎవరిని? వామ్మో నా నువ్వే ట్రైలర్ చూసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. నా నువ్వే అంటూ తన ప్రేమికుడి కోసం ఎదురు చూస్తున్న ఆ ప్రేయసి కథ ఎలా ముగిసింది. అసలు వీరి ప్రేమ చివరికి కంచికి చేరిందా? ఈ సినిమా తో కళ్యాణ్ రామ్ విజయాన్ని అందుకున్నాడా? లేదా…?

నందమూరి కళ్యాణ్ రామ్ , తమన్నా జంటగా నటించిన నా నువ్వే చిత్రం కథ పరంగా చెప్పుకోవాలంటే , RJ గా పనిచేసే మీనా వాలెంటైన్స్ డే నాడు స్పెషల్ షో చేస్తుంటుంది. ఆ క్రమంలోనే తన లవ్ స్టోరీ గురించి చెబుతుంది. తను ప్రేమించిన వరుణ్ (కళ్యాణ్ రామ్) గురించి ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది మీనా. డెస్టినీ మీద బాగా నమ్మకం ఉన్న మీనా.. అసలు డెస్టినీ ఏం లేదు అనే క్యారక్టర్ తో వరుణ్. అలా వారిద్దరు దూరమవుతారు. వరుణ్ ను ప్రేమిస్తూ ఎప్పటికైనా తన ప్రేమకు ఓకే చెప్తాడని చూస్తుంది మీనా. ఇంతకీ వరుణ్ కు మీనా అంటే ఇష్టం లేదా..? వరుణ్, మీనా ల లవ్ స్టోరీకి ముగింపు ఏంటి..? అన్నది సినిమా కథ.

కథ పరంగా ఒక్క ముక్కలో చెప్పేసుకున్నా దర్శకుడు జయేంద్ర కథనాన్ని నడిపించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొదటి 15 నిముషాలలోనే సినిమాలో ఎదో సరికొత్త విషయం దాగుంది అనేది స్పష్టం అవుతుంది. చల్లని గాలిలా పరిచయం అయ్యి టక్కున మాయమై పోయాడు అంటూ తమన్నా ఫస్ట్ ఆఫ్ లో తన ప్రేమ గురించి చెప్పే డైలాగ్ లు యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక సెకండ్ ఆఫ్ లో కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేసాడు అని చెప్పుకోవచ్చు.

PC శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కాన్సెప్ట్ కు తగినట్టుగా కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. శరత్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. మెలోడీ సాంగ్స్ తో ఆకట్టుకునాయి. జయేంద్ర కథ ఓకే అనేలా ఉన్నా కథనం సాగదీతగా ఉంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకుండా కథనం సాగించాడు. కథలో కూడా అంత దమ్ములేదనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ ఎంత ప్రాణం పెట్టి నటించాడో స్క్రీన్ ఫై చూసేటప్పుడు మనకు అర్ధమై పోతుంది. లుక్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కి కెరియర్ బెస్ట్ లుక్ కూడా ఇదే. ఇక తమన్నా, కళ్యాణ్ రామ్ ల కెమిస్ట్రీ చాలా కొత్తగా సినిమాకు ఫ్రెష్ లుక్ ఇస్తుంది. బహుశా ఇది పి. సి శ్రీరామ సినిమాటోగ్రఫీ మాయే కావచ్చు.

రొమాంటిక్ మూవీ కి అర్ధం ఇదిరా అని చెప్పే విధంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సరిత్ సంగీతం ఈ సినిమాకు మరింత రొమాంటిక్ ఫీల్ కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే నా నువ్వే చూస్తున్న మొత్తం సమయం లో ప్రతి ఒక్కరికి వారి లవర్ ఎదో ఒక సందర్భం లో గుర్తుకు వచ్చేంత అద్భుతంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here