IPLలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊహించని షాక్..!

0
593

శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెపాక్ వేదికగా చెన్నై ఢీకొననుంది. IPL 2019 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌కి ఊహించని షాక్ తగిలింది. బ్యాటింగ్‌తో పోలిస్తే.. బౌలింగ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తున్న చెన్నై టీమ్‌ నుంచి గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి (Lungi Ngidi) వైదొలిగాడు.

శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో బౌలింగ్‌ చేస్తుండగా ఈ దక్షిణాఫ్రికా పేసర్ పక్కటెముకల్లో గాయమైంది. దీంతో.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్‌ని నిలిపివేసిన ఈ ఫాస్ట్ బౌలర్.. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా.. కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో.. ఐపీఎల్ 2019 సీజన్‌కి ఎంగిడి దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మహ్మద్ ముసాజే ప్రకటించాడు.

2018 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై తరఫున 7 మ్యాచ్‌లాడిన ఎంగిడి.. 6.0 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా.. సీనియర్ పేసర్లు షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో దారాళంగా పరుగులిస్తున్న తరుణంలో ఈ 23 ఏళ్ల యువ పేసర్ పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కానీ.. గాయం కారణంగా అతను తాజాగా దూరమవడంతో.. ఇప్పుడు జట్టు బౌలింగ్ భారాన్ని వాట్సన్, బ్రావో‌తో పాటు మోహిత్ శర్మ, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్ మోయనున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోనూ గాయం కారణంగా యువ పేసర్ నాగర్‌ కోటి ఐపీఎల్‌కి దూరమైన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here