ప్రయాణ సమయం లో వాంతులు అవ్వకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి.

0
714

కొంతమందికి బస్సు, రైలు వంటివాటిలో ప్రయాణం చేస్తుంటే వాంతులతో బాధపడాల్సిందే. ఈ ప్రయాణాలు అంటే వారికి నరకమే. ప్రయాణ సమయంలో వాంతులు రావడం, తల తిరగడం, వికారం వంటివి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ప్రయాణానికి ముందు కడుపునిండా తినడం సరికాదు. మరీ తప్పదు అనిపిస్తే ఘనాహారం కంటే పండ్లరసాలూ, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి.

How to avoid vomiting during travel time
How to avoid vomiting during travel time

అవీ తియ్యగా ఉండేవే తీసుకోవాలి. పుల్లటి పానీయాలు తీసుకుంటే వికారానికి కారణం కావచ్చు. అలాగని ఖాళీ పొట్టతో కూడా వెళ్లడం మంచిది కాదు. వేపుళ్లూ, మసాలాలూ ప్రయాణ సమయంలో అస్సలు తాకరాదు. వాటికి బదులు ఉడికించినవీ, మిరియాల పొడి చల్లనివి అయితే ఫర్వాలేదు. ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. ప్రయాణం ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్లయితే మాత్రం ముందురోజు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. బాగా నిద్రపోవాలి.

అలసటతో కూడిన ప్రయాణం అయితే మాత్రం శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతుంది. ప్రయాణానికి ముందుగానీ, ప్రయాణ సమయంలోగానీ రెస్టారెంట్లూ, రోడ్‌సైడ్‌ ఆహార పదార్థాలను తినవద్దు. అవి పొట్టలో ఇన్‌ఫెక్షన్‌కి కారణమవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తిని బయలుదేరడానికి ప్రాధాన్యం కావాలి.

ప్రయాణం ప్రారంభం కాగానే పిప్పర్‌మెంట్లు, ఉసిరి, నిమ్మ రుచిగల క్యాండీలూ, నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే బాగుంటుంది. తద్వారా వాంతులు, వికారం దరిచేరదు. ప్రయాణానికి ముందు ఘాటైన పరిమళద్రవ్యాలూ, గాఢత ఎక్కువ ఉన్న మాయిశ్చరైజర్లూ వాడకపోవడం మంచిది. వీటి వాడకం వల్ల వికారం కలిగే ప్రమాదం లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here