గుణ 369 మూవీ రివ్యూ… కార్తికేయ ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాడా? లేదా?

0
512

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న కార్తికేయ తరువాత హిప్పీ సినిమాతో అదే జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో మరోసారి తనకు కలిసొచ్చిన మాస్‌ యాక్షన్‌ ఫార్ములాను నమ్ముకొని గుణ 369గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్‌ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆడపిల్లలను వేధించే వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలన్న సందేశాన్ని కమర్షియల్ జానర్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి ఈ సినిమా కార్తికేయకు మరో సక్సెస్‌ అందించిందా..? తొలి ప్రయత్నంలో అర్జున్‌ జంధ్యాల ఏమేరకు ఆకట్టుకున్నాడు.? విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

ఒంగోలుకు చెందిన గుణ (కార్తీకేయ) బీటెక్ పాసవ్వడానికి కష్టపడుతూ ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఎలాంటి గొడవలకు వెళ్లని మంచి అబ్బాయి. తన వీధిలోకి వచ్చిన గీత (అనఘ)తో ప్రేమలో పడుతాడు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అదే ఊరికి చెందని రౌడీ గద్దలగుంట రాధ (ఆదిత్య మీనన్) హత్య కేసులో జైలుకు వెళ్తాడు. రాధ హత్యకేసులో ఎందుకు జైలుకు వెళ్లాడు? రాధా హత్య తర్వాత గుణ జీవితంలో ఎలాంటి సమస్యలు చోటుచేసుకొన్నాయి. రాధాను హత్య చేసిందెవరు? రాధాను హత్య చేయడానికి కారణమేమిటి? గీతతో ప్రేమ సఫలమైందా? తన కుటుంబాన్ని ఇలాంటి ఇబ్బందుల నుంచి ఎలా కాపాడుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే గుణ 369 కథ.

యాంగ్రీ యంగ్‌మేన్‌గా కార్తికేయ మరోసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌ అంతా లవర్‌ బాయ్‌లుక్‌లో రాముడు మంచి బాలుడులా కనిపించిన కార్తికేయ సెకండ్‌ హాఫ్‌లో మాస్‌ యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మంచి పరిణతి కనబరిచాడు. తొలి చిత్రమే అయినా అనఘ నటన మెప్పిస్తుంది. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్‌ మార్క్స్‌ సాధించింది. తండ్రి పాత్రలో నరేష్‌ ఒదిగిపోయాడు. పెద్దగా స్కోప్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచాడు. రాధ లుక్‌లో ఆదిత్య సూపర్బ్ అనిపించేలా ఉన్నాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మరో కీలక పాత్రలో నటించిన మహేష్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు వేరియేషన్స్‌ చాలా బాగా చూపించాడు.

Karthikeya, Anagha in Guna 369 Movie Release Today Posters

ఒంగోలులోని ఓ గ్రామంలో ఓ దాడి ఘటనతో మంచి హై నోట్‌లో సినిమా మొదలవుతుంది. తొలి పది నిమిషాలు సినిమా పవర్ ఏంటో రుచి చూపిస్తుంది. ఆ తర్వాత నేరుగా కథలోకి వెళ్లిపోవడంతోపాటు కార్తీకేయ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం, అనఘతో రొమాన్స్, అఫైర్ అంశాలతో కథ కొద్దిగా స్లో అవుతుంది. లవ్ ట్రాక్‌ సినిమా ఒకే అనిపించేలా ఉండటం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమా కథ చెప్పే స్వరూపమే మారిపోతుంది.సెకండాఫ్‌తో గుణ 369కు ప్రాణంగా నిలిచింది. ఎమోషన్స్, కథలో ట్విస్టులు, ప్రతీ ఒక్కరి ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచేలా ఉంటాయి. ఇక కథలో ఉండే ఇంటెన్సిటీ ప్రేక్షకుడిని కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తుంది.

తొలి చిత్ర దర్శకుడిగా అర్జున్ జంధ్యాల తన సత్తాను చాటుకొన్నాడనే చెప్పవచ్చు. తొలి భాగంలో లవ్ ట్రాక్‌ను నడిపించేందుకు కొంత తడబాటుకు గురైనట్టు కనిపించిన అర్జున్.. సెకండాఫ్‌లో చెలరేగిపోయాడు. హీరో కార్తీకేయలో ఉండే పాజిటివ్ ఎనర్జీని అవసరమైన ప్రతీ చోట బ్రహ్మండంగా వాడుకొన్నాడు. ఫస్టాఫ్‌లో ప్రారంభంలో వచ్చే కొన్ని సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్‌ను అనుభవం ఉన్న దర్శకుడిగా హ్యాండిల్ చేశాడు. ఇక సెకండాఫ్‌‌లో అర్జున్ జంధ్యాల సత్తా ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇతర పాత్రల్లో నరేష్, హేమ, ఆదిత్య మీనన్, జబర్దస్త్ మహేష్ నటించారు. గద్దలగుంట రాధగా ఆదిత్య మీనన్ పాత్ర సినిమాకు బలం అనిచెప్పవచ్చు. ఆదిత్య మీనన్ పాత్ర చుట్టే సినిమా అల్లుకోవడం వల్ల అతడి నటన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నరేష్, హేమలు మంచి స్వభావం ఉన్న తల్లిదండ్రులుగా ఆకట్టుకొంటారు. ప్రతీ ఇంట్లో చూసే తల్లిదండ్రులను వారు మరిపిస్తారు. జబర్దస్త్ మహేష్ నటన, కామెడీ టైమింగ్ బాగుంది. రంగస్థలం, మహానటి తర్వాత మరో అద్భుతమైన పాత్రలో కనిపిస్తాడు. ఎవరూ ఊహించిన విధంగా నటనతో మెప్పిస్తాడు.

టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే, సినిమాటోగ్రాఫర్‌గా రామిరెడ్డి తన పనితీరుతో ఆకట్టుకొన్నాడు. జీయమ్‌ శేఖర్ ప్రతిభను చక్కగా వాడుకొన్నారు. ఊరి వాతావరణాన్ని చక్కగా ప్రతిబించేలా తెరకెక్కించారు. యాక్షన్ సీన్లు చాలా హైలెట్‌గా చిత్రీకరించారు.. గ్రాఫిక్స్ వర్క్ కూడా నీట్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ ఫైట్ సందర్భంగా ఇతర కొన్ని సన్నివేశాలు గ్రాఫిక్స్ బాగున్నాయి. ఇక RX 100 సినిమాతో మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకొన్న చైతన్ భరద్వాజ్ ఆడియో పరంగా ఆకట్టుకొన్నాడు. పాటల ప్లేస్‌మెంట్ సరిగా లేకపోవడం వల్ల తెరమీద పాటలు రిజిస్టర్ కావడానికి సమస్యగా కనిపిస్తుంది. ఎడిటర్ తమ్మిరాజు మరోసారి తన కత్తెరకు పదను చూపించాడు. ఫస్టాఫ్‌లో సినిమాను కొంత ట్రిమ్ చేస్తే సినిమా మరింత బాగుంటుంది.

యదార్థ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు అర్జున్‌ జంధ్యాల ఆ కథను మాస్‌ కమర్షియల్ స్టైల్‌లో చెప్పే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యాడు. బోయపాటి దగ్గర పనిచేసిన అనుభవంతో మాస్‌, యాక్షన్‌ సీన్స్‌ను చాలా బాగా ప్రజెంట్‌ చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌లో వచ్చే లవ్‌ సీన్స్‌లో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. సెకండ్‌ హాఫ్‌ను ఎమోషనల్‌, యాక్షన్‌, సెంటిమెంట్ సీన్స్‌తో ఆసక్తికరంగా మలిచాడు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఎదురవుతున్న ఇబ్బందులను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు మాస్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయటంలోనూ మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ హైలెట్‌గా నిలుస్తుంది. చైతన్ భరద్వాజ్‌ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

సామాజిక సందేశం, వినోదం, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రం గుణ 369. సెకండాఫ్‌లో సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్, ఎమోషనల్‌గా తీర్చిదిద్దడంలో నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల తన మార్కును ఎస్టాబ్లిష్ చేసుకొన్నాడు. కార్తీకేయ కమర్షియల్‌ హీరోగా మరో మెట్టు ఎక్కుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా సినిమా రూపొందింది. బీ,సీ సెంటర్లలో ఉండే ఆదరణ బట్టి ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ రెండు రోజులు స్పష్టమవ్వడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here