కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

0
784

చాలామంది ఎన్నో కలలకు కంటారు. ఉదయం జరిగింది మొదలు.. రాత్రి పడుకునేవరకూ ఎన్నో విషయలని కలలుగా వస్తుంటాయి. నిద్రంలో సాధారణంగా కలలు కంటాం. అది సహజమైన ప్రక్రియ. వాటిలో మంచి, చెడూ రెండూ ఉంటాయి. కొన్ని కలల మాత్రం భవిష్యత్తులో జరగబోయే శుభం, లాభానికి సంకేతాలట. అలాగే అపశకునం లేదా ప్రమాదానికి హెచ్చరికలాగానూ కొన్ని కలలను భావిస్తారు. కొంతమందికి దేవుడు కలలో కనిపిస్తాడు.. అది ఎందుకు సంకేతమో పండింతుల చెబుతున్నారో చూద్దాం..

దేవుడు కలలో కనిపిస్తే చాలామంచిది. మీరు జరుగవనుకున్న పనులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సందేహపడుతుంటే మీ అంతరంగాన్నే నమ్మండి.. మీ అంతరాత్మ ఎలా చెబితే అలా చేస్తే మంచిజరుగుతుందని నమ్మకం. అదేవిధంగా దేవుడి ఆశీస్సులు, కరుణ కూడా మీపై, మీ కుటుంబంపై ఉన్నట్లే. మీరు కష్టాల్లో ఉంటే త్వరగా బయటపడతారని ఓ సూచన అనుకోవచ్చు.

అంతేకాదు.. కొన్నిసార్లు మనం ఏవోవే మొక్కులు మొక్కుకుంటాం. వాటిని మర్చిపోతుంటాం. ఇలాంటి సందర్భాల్లోనూ దేవుడు మనకి వాటిని గుర్తుచేసేందుకు వస్తాడని పండితులు చెబుతున్నారు. అలాగే కలలో సూర్యుడు కనబడితే త్వరలోనే కొంచెం ధనం రాబోతుందని సంకేతం. అంతేకాదు ఎక్కువ కాంతితో సూర్యుడు కనిపిస్తే త్వరలోనే అధిక ధనవంతులుగా మారుతారు. కలలో చంద్రుడు కనిపిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారని అర్ధం. చంద్రుడు ప్రశాంతతకు చిహ్నం. కాబట్టి మనలో ఉన్న కోపం కూడా తగ్గుతుంది.

నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద విషయం కాదు. జుట్టు రాలుతున్నట్టు కల వచ్చిందంటే త్వరలోనే లక్ష్మీదేవి కటాక్షం, ఆశీర్వాదం పొందుతారని సంకేతమట. సాధారణంగా ఆఫీసు లేదా బయటకు వెళ్లేటప్పుడు అందంగా తయారవుతారు. ఇలా రెడీ అవుతున్నట్టు, ముఖం అందంగా ఉన్నట్టు కనిపించినా త్వరలోనే సంపన్నులు అవుతారని అర్ధమట. బియ్యం, పాలు, చక్కెరతో తయారు చేసిన పాయసం కలలో దర్శనమిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం. అందమైన అద్దాలు కలలో కనిపిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారనడానికి సంకేతం. అయితే పగిలిన అద్దం కలలోకి వస్తే మాత్రం చెడు జరుగుతుందట.

పూర్వీకులు కొన్ని రకాల కలలను భవిష్యత్తులో జరగబోయే ఘటనలకు సంకేతంగా వర్ణించారు. దీనిని ఇప్పటికీ చాలా మంది బలంగా నమ్ముతారు. మనకు కలలు వస్తున్నాయంటే భవిష్యత్‌లో జరగబోయే వాటికి ఆనవాళ్లని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, కొన్ని రకాల కలలు కంటే తొందరలోనే ధనవంతులు అవుతారని భవిష్య పురాణం చెబుతోంది. బంగారం ధరించినట్టు కలగంటే ఆభరణాలు, అపార సంపదలు త్వరలోనే మీ జీవితంలోకి వస్తాయని సంకేతం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here