చుండ్రుని ఈ చిట్కాలతో శాశ్వతంగా పారదోలండి

0
582

సాధారణంగా మనలో చాలా మంది అనేక జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, కాలుష్యం, వాతవరణంలో వేడి, వల్ల జుట్టు అధికంగా రాలే సమస్య ఒకటైతే, చుండ్రు మరో ప్రధాన సమస్య. చుండ్రు మాత్రమే కాదు, తలలో దురద, తలలో మొటిమలు, చర్మం పొట్టు రాలడం, హెయిర్ డ్యామేజ్, మరియు ఇతర జుట్టు సమస్యలు. చుండ్రుని శాశ్వతంగా తొలగించడానికి ఈ ఆర్టికల్ లో మంచి మంచి చిట్కాలను ఇచ్చాము… పూర్తిగా తెలుసుకొని చుండ్రుని వొదిలించుకోండి

కొందరిని చుండ్రు సమస్య విపరీతంగా బాధపెడుతుంది. కారణం, దీనినుండి ఎదురయ్యే ఇబ్బందే! చుండ్రు శిరోజాల అందాన్ని పాడుచేయడంతో పాటూ, ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. మానసికంగానూ చికాకు పెడుతుంది. చుండ్రు వల్ల జుట్టు పెరగకపోగా, ఇంకా ఎక్కువగా ఊడుతుంది. చలికాలం లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చుండ్రును చాలా త్వరగా నివారించడానికి కొన్ని బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి.

కాసింత బేకింగ్ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే, మరీ ఎక్కువగా బేకింగ్ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది.

వెనిగర్‌తోనూ ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. అందుకోసం ఆరు చెంచాల నీటిలో 2 చెంచాల వెనిగర్ కలిపాలి. ఇప్పుడు షాంపూతో తలస్నానం చేశాక ఆ నీటితో తలని కడగాలి. వారానికి ఓ సారి ఇలా చేయడం వల్ల త్వరలోనే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.పుల్లగా ఉండే పెరుగులో నిమ్మరసంలు కలిపి తలకు రాయాలి. ఆరాక తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే తలలోని చుండ్రు దూరమవ్వడమే కాకుండా జుట్టు కూడా కాంతులీనుతూ ఉంటుంది.

యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా చుండ్రు సమస్యని తగ్గించుకోవచ్చు. రెండు స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్‌ని షాంపూ లేదా కొబ్బరినూనెలో కలిపి రాయాలి. ఇలా చేసిన తర్వాత ఇబ్బంది లేదనుకుంటే రాత్రంతా ఉంచేసుకోవచ్చు. లేదా అరగంట తర్వాత తలస్నానం చేసేయొచ్చు. ఈ రెమిడీ కూడా డాండ్రఫ్‌ని పోగొట్టడంలో భేషుగ్గా పనిచేస్తుంది.

వారంలో రెండు రోజులు తలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయండి. ఆలివ్‌ ఆయిల్‌లో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి. రాత్రి పడుకునే ముందు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి తలచుట్టూ టవల్‌ లేక స్కార్ఫ్‌ కట్టుకుని పడుకుంటే ఆయిల్‌ బాగా అబ్జార్బ్‌ అవుతుంది. నిమ్మ ఆకులను అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. నలభైనిమిషాల పాటు అలా వదిలేసి తరువాత నీటితో కడుక్కోవాలి.

అలోవెరాలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు అలోవెరా జెల్‌ను పట్టించి నలభై నిమిషాల తరువాత కడుక్కుంటే చుండ్రు సమస్య దూరమవుతుంది. మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్‌ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి నెల పాటు చేయాలి. చుండ్రు ఛాయలు కనిపించకుండా పోతాయి.

వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. డాండ్రఫ్ పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు తీసుకొని 4-5 కప్పుల వేడి నీటిలో వేసి రాత్రంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోండి. మిగిలిపోయిన వేపాకులను పేస్ట్‌గా చేసుకొని మాడుకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది.

ఆపిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఫంగస్‌ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఇందుకోసం వెనిగర్, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల డాండ్రఫ్‌ను కూడా అరికట్టవచ్చు

షాంపూ చేసుకున్న తర్వాత సరిపడా నీటితో తలను శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా తల మీద నూనె, మృత కణాలు తొలగిపోవు. ఫలితంగా అది డాండ్రఫ్‌కు దారితీస్తుంది. తక్కువ గాఢత ఉండే షాంపూతో తరచుగా తలంటుకోవాలి. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ రాసుకునే అలవాటు ఉంటే.. దాన్ని మాడుకు అంటకుండా చూసుకోండి.

ఆస్పిరిన్ ట్యాబ్లెట్లతోనూ డాండ్రఫ్‌ను అరికట్టవచ్చు. రెండు ఆస్పిరిన్ ట్యాబ్లెట్లను నలిపి న్యాప్‌కిన్‌లో ఉంచి ముక్కలుగా చేయాలి. తర్వాత ఆ పొడిని గిన్నెలోకి తీసుకొని రెగ్యులర్‌గా వాడే షాంప్‌ను కొద్దిగా ఆ పొడికి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నిమిషాలయ్యాక నీటితో కడిగేసుకోవాలి. కొబ్బరి నూనెతోనూ డాండ్రఫ్‌ను తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 – 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here