అయోధ్య గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు..

0
227

అయోధ్య సమస్య భారతదేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడించిన సమస్యలలో ఒకటి. ఈ సమస్యకు ఇటీవలే పరిష్కారం లభించింది. అయోధ్య నగరం ఇతర ప్రాంతాల మాదిరిగా భౌగోళిక ప్రాంతంగా ఉండిపోలేదు. రామ జన్మభూమిగా పురాణాల కాలం నుండి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. అందుకే మన దేశంలోని అనేక మంది హిందువులు ఈ ప్రాంతాన్ని చేరుకోవాలని, ఈ మట్టిని ఒక్కసారైనా ముట్టుకోవాలని లక్షలాది మంది ఎంతగానో ఆరాధించేలా చేసింది.

ఇప్పటివరకు అయోధ్య అంటే రాముని దేవాలయం మరియు బాబ్రీ మసీదు అని చాలా మందికి తెలుసు. కానీ ఇప్పటి నుండి అయోధ్య నగరం ఎలా మారబోతోందో తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో అయోధ్య గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ లోని ఫైజా బాద్ జిల్లాలోని సారు నది ఒడ్డున ఉంది. అయోధ్య అంటే ఆధ్యాత్మిక నగరంగా అందరూ భావిస్తుంటారు.

కోసల దేశంలో ఉన్న అయోధ్యను మనవు స్వయంగా నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. పురాణాల ప్రకారం అయోధ్య నగరం రాముని జన్మస్థలం అనేక మంది హిందువులు నమ్ముతారు. అందుకే అయోధ్యను పవిత్ర నగరంగా భావిస్తారు. అయోధ్య నగర వైశాల్యం అప్పట్లో 7.056 చదరపు కిలోమీటర్లు. అయోధ్య నగరంలో అప్పట్లో చదరంంలో ఉండే పలకల మాదిరిగానే అక్కడి భవన నిర్మాణాలు ఉండేవని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

ఈ భవనాలు అందంతో పాటు ప్రజల్ని కాపాడేందుకు శత్రువుల ఊహాలకు కూడా అందని విధంగా ఉండేలా అప్పటి శిల్పులు నిర్మాణ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకున్నట్లు వాల్మీకి రచనల్లో కనిపిస్తుంది. అయోధ్య నగరాన్ని రాముడి తండ్రి దశరథుడు పాలించిన కాలంలో అక్కడు అందరూ సంపన్నులే. ధన, ధాన్య, వాహనం, ఇళ్ల వంటి వాటితో పాటు అన్ని పుష్కలంగా ఉండేవి.

ఈ సంపదను కూడా అక్కడి యజమానులు ధర్మంగా, న్యాయంగా, నిజాయితీగా సంపాదించి, అలాగే ఖర్చు చేసేవారని పురాణాల్లో పేర్కొనబడింది. అప్పట్లో వాణిజ్య పరంగా అయోధ్యతో పోటీ పడే నగరమే లేదు. ఈ నగరంలో సరిగ్గా కేంద్రభాగంలో దుకాణాలు ఉండేవి. ఇక్కడ క్రయవిక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో నగరంలోని ప్రధాన వీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కేవలం కప్పం చెల్లించటానికే సామంతరాజులు ఇక్కడ బారులు తీరేవారు అని పురాణాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here