కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త

0
257

ఏ కాలమైనా సరే చాలామంది ఎంతో ఇష్టంగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఎండాకాలంలో అయితే మరీనూ.. దీని వల్ల దాహం తీరుతుంది కానీ, ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు అమాంతం పెరుగుతుంది. కూల్ డ్రింక్స్‌లో ఎక్కువ కెలోరీలు, చక్కెర శాతంలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల షుగర్, ఊబకాయం, గుండెసమస్యలు వచ్చే ప్రమాదముంది. బరువు తగ్గాలనుకునేవారు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండడం చాలా మంచిది. కూల్‌డ్రింక్స్‌లో సోడా శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై మళ్లీ మళ్లీ తింటాం. దాంతో.. బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అంతేకాదు.. ఇందులోని కెమికల్స్ శరీరానికి చెడు చేస్తాయి.. వీటిని ప్రూవ్ చేసేందుకు చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ కూడా పెడుతున్నారంటే అవేంటంటే.. కూల్ డ్రింక్స్ తో ఇంట్లోని సింక్స్ క్లీన్ చేయడం. అంటే.. యాసిడ్‌కి బదులు వీటిని వాడడం అన్నమాట.. ఇప్పుడైనా అర్థం చేసుకోండి.. చల్లని ఈ జలం.. నోట్లోకి వెళ్లగానే గరళంగా మారి ప్రాణాలమీదకి తెస్తుందని.. కూల్‌డ్రింక్స్ తాగాలనుకున్నప్పుడు నీటిని తీసుకోండి.. లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. దీనివల్ల అనారోగ్యం దూరమై ఆరోగ్యవంతులుగా మారతారు.

కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? కాస్త ఆలోచించండి.. కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్ తాగడం వల్ల ఉత్సాహం వస్తుందని, శక్తి వస్తుందని ప్రకటనలు వస్తున్నా.. కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కిడ్నీలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌లో ఉండే చక్కెరతో మూత్రపిండాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని జపాన్‌కు చెందిన ఒసాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు.

ఇందులోని చక్కెర మూత్ర పిండాల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు వీరి అధ్యయనంలో తేలింది. రోజుకు కనీసం రెండు కూల్‌డ్రింక్స్‌ తీసుకునే వారిలో ప్రొటీనూరియా లేక మూత్రంలో ప్రోటీన్ల విసర్జన ఎక్కువగా జరుగుతున్నట్టు వీరు తమ అధ్యయనంలో గుర్తించారు. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ తాగేటప్పుడు కాస్త ఆలోచించండి. See Below Video For More Information

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here