జబర్దస్త్ చమక్ చంద్ర ఎంత సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0
730

తెలుగు టీవీ చానల్స్ లో మోస్ట్ పాపులర్ రియాల్టీ షోగా రాణిస్తున్న ప్రోగ్రాం జబర్దస్త్ . మొదట్లో ఈ షోకి విమర్శలు వచ్చినా ఆ తరువాత వీరలెవెల్లో క్లిక్ అయిన షో ఇది. 2013లో మొదలైన ఈ షో నిర్విరామంగా కొనసాగుతుంది. ఇక టిఆర్పి రేటింగ్ లోను అదరగొడుతూ ఈటీవీ ని నెంబర్.1 ఛానల్ గా నిలిపింది. 6 నుంచి 60ఏళ్ళ వయస్సు వాళ్ళ వరకూ అందరినీ ఆకర్షించి అలరిస్తున్న షోగా జబర్దస్త్ గుర్తింపు పొందింది. ఇక ఈ షోద్వారా ఎంతోమంది కమెడియన్స్ గా ఎదిగారు. కొందరు బయట షోలతో కూడా సంపాదన పెంచుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా ‘జబర్దస్త్’ఫెమ్ అనే పేరు మారుమోగిపోతోంది. ఇక ఆ షో లో నటించి నవ్వించే వారు ఆర్ధికంగా బానే నిలదొక్కుకున్నారు.

జబర్దస్త్ లో నటించిన వాళ్ళు యాంకర్లుగా, జూనియర్ ఆర్టిస్టులుగా,హీరోలుగా,రాణిస్తూ సంతోషంగా వున్నారు. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడి ఈ షోలో ఎంట్రీ సంపాదించినవాళ్లు, ఇప్పుడు పదిమందికీ సాయం చేసే స్థాయికి కూడా కొందరు ఎదిగారు. ఇక ఈ షో ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన నటుడు చమక్ చంద్ర.యితడు అమ్మాయి వేషం కట్టి, షో లో కనిపిస్తే చాలు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటారు. మిగిలిన వారికి భిన్నంగా స్కిట్స్ రూపొందించి ప్రదర్శించడంలో చమక్ చంద్ర దిట్ట.

ఇక సినిమాల్లో కూడా తనదైన బాణీలో నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు అద్దెంట్లో ఉండే చమక్ చంద్ర, అద్దె కట్టడానికే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఐతే ఇప్పుడు మణికొండలో కోటి రూపాయలు పెట్టి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. అంతేకాదు ఓ బెంజి కారు కూడా కొనేసాడు. చమక్ చంద్ర లెవెల్ పూర్తిగా ఇలా మారిపోవడం చూసి చాలామంది షాకయ్యారు. కష్టపడే తత్త్వం,చిత్తశుద్ధి ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వున్నా, ఉన్నత స్థాయికి చేరగలం అని అనడానికి చమక్ చంద్ర ఒక ఉదాహరణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here