‘భరత్ అనే నేను’.. ఫస్ట్ రివ్యూ.. హిట్టా? ఫట్టా.?

0
1716

బారి అంచల మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్యం లో వస్తున్నా రెండవ సినిమా భారత్ అనే నేను రేపు విడుదలకి సిద్ధమైంది. ఇందులో మహేష్ బాబు మొదటి సరిగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోయున్నాడు. మహేష్ బాబు పక్కన కైరా అద్వానీ ముఖ్యమంత్రికి ప్రియురాలుగా ఆక్ట్ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో కొరటాల శివ మహేష్ బాబు కలిసి తీసిన శ్రీమంతుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ అదే కాంబినేషన్ లో భారత్ అనే నేను తో ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. అందులో వచ్చాడైయో స్వామి అనే సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపుతుంది. దేవ్ దానయ్య తన నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకోని భారీగా ఈ సినిమాని విడుదలకు ప్లాన్ చేసారు.

సినిమా ఎలావుండబోతుంది అంటే:
సినిమా మొదలైన పది నిమిషాల నుండి మహేష్ బాబు సీఎం గా కనిపిస్తానని మహేష్ బాబు నిన్న జరిగిన మీడియా ఇంటరేక్షన్ లో చెప్పాడు. అయితే ముఖ్యమంత్రి అయినా తరువాత తాను చేసిన ప్రమాణాలను మరియు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మహేష్ చేసి కృషి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని సినిమా లో పని చేసిన వారు చెప్తున్నారు. సినిమాలో మహేష్ బాబు చాలా ఫ్రెష్ లుక్ లో కనిపించనున్నారు. మహేష్ బాబు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసే సమయం లో మహేష్ చెప్పిన వాయిస్ లో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి వాయిస్ అచ్చు గుద్దినట్లు ఉందని అందరు అన్నట్లే, మహేష్ బాబు గారు కూడా నిన్న మీడియా ఇంటరాక్షన్ లో చెప్పారు.

 

మహేష్ కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ కూడా భిన్నంగానే కనిపిస్తోంది. కానీ ఇకపై తాను రిస్క్ తీసుకోనని మహేష్ తేల్చి చెప్పడం విశేషం. ఇకపై అభిమానులు కోరుకునే సినిమాలే చేస్తానని మహేష్ స్పష్టం చేశాడు. ప్రయోగాలు చేసీ చేసీ అలసిపోయా. ఇక మీదట కూడా చేస్తే నాన్నగారి అభిమానులు ఇంటికొచ్చి మరీ కొడతారు. ఇక మీదట కమర్షియల్ సినిమాలు చేస్తా. చాలా సినిమాల్లో నా పాత్రల విషయంలో ప్రయోగాలు చేశాను. నేరుగా చెప్తున్నాను… ఇకపై నా అభిమానులు నన్ను ఎలాంటి సినిమాల్లో అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలే చేస్తాను’’ అని మహేష్ స్పష్టం చేశాడు. అభిమానుల కోసం సినిమాలు చేస్తానంటూనే.. అభిమానుల తీరు కూడా మారాలని మహేష్ సూచించాడు. ఓ హీరో సినిమా విడుదలైతే మిగిలిన హీరోల అభిమానులు దాన్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది సినిమాకి మంచిది కాదని.. అలాంటి అభిమానులంతా మారాల్సిన అవసరం ఉందని మహేష్ అభిప్రాయపడ్డాడు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్వకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భరత్ అనే నేను. ’ఈ చిత్రం ఏప్రిల్ 20న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.. మహేష్ బాబు ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా పై తొలి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధూ భరత్ అనే నేను చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు.. చిత్రం బ్లాక్ బస్టర్ అంటూ తేల్చేశాడు.

మహేష్ బాబు ప్రిరీలిజ్ ఫంక్షన్ లో చెప్పినట్టుగానే ఈ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ ఫామెన్స్ అని ఉమేర్ సంధూ చెప్పుకొచ్చాడు. ఇందులో అత్యుత్తమంగా నటించాడని.. ఎమోషనల్ సీన్స్ లో మహేష్ బాబు నటన అద్భుతమని ప్రశంసించాడు. యాక్షన్ సన్నివేశాల్లో మహేష్ క్లాస్ లుక్ తో అదరగొట్టాడని తెలిపారు. చదువుకున్న వాడిగా.. ముఖ్యమంత్రిగా మహేష్ ఈ చిత్రంలో కనిపిస్తాడని వివరించాడు.

ఇక ఈ సినిమాలోని కథ మైండ్ బ్లోయింగ్ అని ఉమేర్ పేర్కొన్నాడు. దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక మైన శైలితో కమర్షియల్ చిత్రాల్లో సామాజిక అంశాలను మేళవించిన తీరు అద్భుతమన్నాడు. ఈ చిత్రంలో బలమైన కాంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసి విధంగా ఆయన దర్శకత్వం వహించాడని తెలిపారు. రాసిన డైలాగులు బాగున్నాయన్నారు.

మొత్తంగా సినిమాలో మహేష్ బాబు నటన, హీరోయిజం.. ఎలివేట్ చేస్తూ దర్శకుడు మహేష్ ను చూపించిన విధానం.. కైరా అద్వానీ నటన.. డైలాగులు.. సినిమాటోగ్రఫీ అంశాలు భరత్ అనే నేను చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేశాయని చెప్పుకొచ్చారు.

Watch Here the Pre Review of Bharat Ane Nenu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here