ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్న అవేంజర్స్: ఎండ్ గేమ్ మూవీ రివ్యూ

0
650

ప్రపంచం మొత్తం అవేంజర్స్: ఎండ్ గేమ్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఇండియా లో ఈ రోజు విడుదలైన ఈ చిత్రం.. రిలీజ్‌కు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. అవేంజర్స్: ది ఎండ్ కోసం యువత ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దీంతో ఇప్పటికే మన దేశంలో 25 లక్షల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. బాహుబలి-2 కోసం 33 లక్షల టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ రూపంలో అమ్ముడుపోగా.. అవేంజర్స్‌‌కు అదే రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం విశేషం. అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్ అడ్వాన్స్ బుకింగ్‌ల రికార్డులను తాజా చిత్రం బ్రేక్ చేసింది. అయితే ఇవాళ విడుదల అయినా ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం.

అవేంజర్స్: ఎండ్ గేమ్‌కు మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వన్ వర్డ్ రివ్యూ ఇచ్చేశారు. ‘మార్వెల’స్ అని ట్వీట్ చేసిన ఆయన ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. అంచనాలను మించి ఈ చిత్రం ఆకట్టుకుందన్నారు. ఎమోషనల్, హ్యూమర్.. ఇలా బోలెడంత సర్‌ప్రైజ్ ఈ మూవీలో ఉందన్న ఆయన.. బాక్సాఫీస్ సునామీ కోసం సిద్ధంగా ఉండాలన్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫ్రాంచైజీ తెరక్కెకించిన 21 చిత్రమైన అవేంజర్స్: ది ఎండ్ చైనాలో ఓపెనింగ్ రికార్డులను కొల్లగొట్టింది.

చైనాలో ఈ చిత్రం 107.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. చైనాలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. భారత్, కెనడా, అమెరికా లాంటి దేశాల్లో విడుదల కాకముందే.. ఈ చిత్రం 169 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇది దాదాపు రూ.1186 కోట్లకు సమానం. తొలి వారాంతానికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా. See The Visual Review in This below Video ⇓⇓

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here