ఆ కోర్కెలు పెంచే మిరకిల్ తేనెను బ్యాన్ చేసిన అమెరికా.. ఎందుకో తెలుసా?

0
501

అమెరికాలో సహజ ఉత్పత్తుల క్రేజ్ నానాటికీ పెరిగిపోతోంది. హైబ్రీడ్ ప్రొడక్ట్స్, కాస్మోటిక్స్, అలోపతి మందులతో వెర్రెక్కిపోయిన జనం హెర్బల్ ప్రోడక్ట్స్ కోసం అంటే చాలు వేలం వెర్రిగా కొనేస్తున్నారు. అయితే మిరకిల్ హనీ పేరిట హెర్బల్ తేనెను మార్కెట్లోకి లెపర్డ్ అనే సంస్థ విడుదల చేసింది. అయితే తమ ఉత్పత్తులకు గిరాకీ బాగా రావాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. లెపర్డ్ మిరకల్ హనీ, మామూలు తేనే కాదని, లైంగిక కోరికలను తీర్చే మూలికలను కలిపిన సహజ ఉత్పత్తి అని కంపెనీ మార్కెటింగ్ చేసింది.

అంతే కాదు తమ తేనెలో అటవీ ఉత్పత్తులైన జిన్సెంగ్ వేర్లు, టాంగ్‌కట్ అలి వేర్లు, శుద్ధమైన యాలకుల పొడి కలిపామని తెలిపింది. ఇంకేముంది…లైంగిక కోరికలు పెంచే సహజమైన వయాగ్రా అని ప్రచారం ఊపందుకోవడంతో సేల్స్ ఒక్కసారిగా పెరిగాయి. అయితే అమెరికాలోని ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ మాత్రం మిరకిల్ తేనే సేల్స్ ఒక్కసారిగా పెరగడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతే కాదు జనాలు ఎగబడి మరీ ఈ మిరకల్ తేనేను కొంటున్నారు… అందులో నిజంగానే సహజమైన ఉత్పత్తులు ఉన్నాయా లేదా.. అని భావించి, వెంటనే మిరకిల్ హనీ శాంపిల్స్ తెప్పించి టెస్ట్ చేసింది.

అయితే మిరకిల్ హనీ బండారం టెస్ట్ లో బయటపడింది. ఇన్ని రోజులు సహజ వయాగ్రా అని ఊదరగొట్టిన సదరు లెపర్డ్ కంపెనీ, తేనెలో వయాగ్రా మాత్రలను కలిపి అమ్ముతోందని తేలింది. వయాగ్రా మాత్రల్లో వాడే సిల్డెనఫిల్ ను తేనెలో కలిపేసి సహజ తేనె అంటూ సీక్రెట్ హెర్బల్స్ కలిపామంటూ బిల్డప్ ఇచ్చారు. అయితే డాక్టర్ సూచన లేకుండా వయాగ్రాను తీసుకోరాదు. అంతే కాదు 18సంవత్సరాల లోపు వారు వయాగ్రా తీసుకుంటే చాలా ప్రమాదకరం. అలాగే మోతాదుకు మించి వయాగ్రా తీసుకుంటే కూడా గుండె పోటు వచ్చే ప్రమాదముంది. ఇవన్నింటి నేపథ్యంలో ఎఫ్డీఏ సంస్థ మిరకిల్ హనీని బ్యాన్ చేసింది. అయితే ఇంత కాలం తమ లైంగిక కోరికలను తీర్చిన తియ్యటి తేనే దొరకడం లేదని కొందరు మాత్రం నిట్టూరుస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here