‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ లాంటి హిట్ చిత్రాలతో రవితేజకు మాస్ రాజా ఇమేజ్ ఇచ్చిన శ్రీను వైట్లపై నాలుగవ చిత్రంగా మైత్రీ మూవీస్ మేకర్స్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ (Amar Akbar Anthony) చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో గోబా బ్యూటీ ఇలియానా రవితేజతో నాలుగో సారి జోడి కట్టింది. భారీ అంచనాలతో ఈ రోజు థియేటర్ లో సందడి చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
మూడు పాత్రలలో రవితేజ గెటప్ విషయంలో పెద్దగా వేరియేషన్ లేకపోయినప్పటికీ హావభావాలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ సినిమాలో సీరియస్ లుక్ లో కనిపిస్తారు రవితేజ. అయితే సినిమాలో ప్రతి సీన్ చూస్తుంటే అమర్ అక్బర్ ఆంటోని లు ముగ్గురు కొక్కరేనా లేక మూడు పాత్రలు ఉండబోతున్నాయా.. అనే సందేహాలు వ్యక్తం అవుతూ.. సినిమా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఇక రవితేజ ఇలియానా మధ్య వచ్చే సన్నివేశాలు కిక్ సినిమాని మించే విధంగా కామెడీ తో లవ్ స్టోరీ నడుస్తుంది.
ఈ సినిమలో ఓ యంగ్ కమిడియన్ పెర్ఫార్మన్స్ మరియు తమన్ background మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తాయి. దూకుడు లో బ్రహ్మానందం కామెడీ ఈ విధంగా వర్కౌట్ అయిందో.. మళ్ళీ ఆ స్థాయిలో కామెడీని… కమిడియన్ సత్య నుండి శ్రీను వైట్ల రాబట్టాడు అని చెప్పాలి. ఈ సినిమాలో సునీల్ ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు.. సునీల్ ని ఈ సినిమాలో చూస్తుంటే.. పాత సినిమాలో సునీల్ చేసే కామెడీ ని గుర్తుకు తెస్తాడు.
హీరోయిన్ Ileana చెప్పిన డబ్బింగ్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే… అలాగే తమన్ background మ్యూజిక్ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇప్పటివరకు రవితేజ సినిమాల టాక్ మిక్స్డ్ గా ఉన్న ఈ సారి అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా పక్క హిట్ ఖాయమని USA ప్రీమియర్ టాక్ నుండి తెలుస్తుంది. చివరిగా అమర్ అక్బర్ ఆంటోని’ ముగ్గురా లేక ఒక్కరే అనేది మీరు థియేటర్ లో చూసి తెలుసుకోండి.
For Complete Review Stay Connect With Us