బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా గురించి మీకు తెలియని చాలా విషయాలు

0
513

అలీ రెజా (Ali Reza) బిగ్ బాస్ లోకి సెలెబ్రెటీ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అలీ రెజా అసలు ఎవరు? అతను ఏమేమి సినిమాలు చేసాడు? అతని background ఏంటి? అనే విషయాల గురించి అందరు బిగ్ బాస్ 3 స్టార్ అయినప్పటినుండి తెగ వెతకడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు నేను అలీ రెజా గురించి అన్ని డిటైల్స్ ను మీతో షేర్ చేయబోతున్నాను. అలీ రెజా… తన స్కూలింగ్ సికింద్రాబాద్ లోని St John’s Church High School లో కంప్లీట్ చేశాడు. ఇంటర్ కూడా అక్కడే St John’s కాలేజీ లో చదివాడు.

అలీ రెజా పేరెంట్స్ ఒకప్పుడు దుబాయ్ లో పని చేసి తిరిగి వచ్చి హైదరాబాద్ లోని Marredpally లో సొంతగా రెస్టారెంట్ ను నడుపుకుంటున్నారు… ఇక అలీ రెజా కెరియర్ విషయానికి వస్తే… 2008 లో Mukhbiir అనే బాలీవుడ్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు… ఆ తరువాత 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకోని జీ తెలుగులో పసుపు కుంకుమ అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యాడు… ఆ సీరియల్ బాగా హిట్ అవ్వడంతో 4 సంవత్సరాలు ఆ సీరియల్ చెయ్యడానికే అలీ రెజా టైమ్ మొత్తాన్ని కేటాయించాడు…

పసుపు కుంకుమ సీరియల్ చేస్తుండగా అలీ రెజా కు ఒక సినిమా ఆఫర్ వచ్చింది… 2014 లో గాయకుడు అనే సినిమాతో తెలుగు వేడితెరపై హీరోగా కనిపించాడు… అయితే ఆ సినిమా బాగా ఆడకపోయినా అలీ రెజా పెరఫార్మెన్స్ కి మంచి మార్కులు వచ్చాయి… దానితో సినీ మహల్ అనే మూవీ కూడా చేసాడు… అది కూడా అనుకున్నంత సక్సెస్ తీసుకురాకపోవడంతో… డీలా పడ్డ అలీ రేజాకు… రామ్ చరణ్ దృవ సినిమాలో…. రామ్ చరణ్ కి స్నేహితుడిగా నటించే అవకాశం వచ్చింది… ఈ సినిమాలో తనను తాను ప్రూవ్ చేసుకోవడం తో “Naa Routee Separate” అనే సినిమా అవకాశం వచ్చింది… అది కూడా రిలీజ్ అయినా… ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు…

ఇక తనకు సినిమాలు అచ్చిరావు అనుకున్నాడేమో తెలియదు కానీ…. తరువాత Evare Nuvvu Mohini , Maate Mantramu అనే సీరియల్స్ లో నటించాడు… ఇప్పడు బిగ్ బాస్ 3 లో అవకాశం రావడంతో తాను నటిస్తున్న సీరియల్స్ ని పక్కన పెట్టి… తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి బిగ్ బాస్ 3 లో అడుగు పెట్టాడు… మరి అలీ రెజా బిగ్ బాస్ ప్రయాణం ఎలా ఉండనుందో వేచిచూడాల్సిందే… బిగ్ బాస్ 3 లో మీ ఫేవెరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ లో మాకు తెలియజెయ్యండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here