ప్రపంచంలో ఇంకా బ్రతికున్న 7 అరుదైన జంతువులు

0
140

ప్రపంచంలోనే అతి భయంకరమైన జంతువులేంటో తెలుసా? వాటిని జంతువులు అనటం కంటే ఏలియన్స్ అనటమే మేలేమో. వింత వింత జంతువులకు ఈ సృష్టిలో కొదవే లేదు. అందులో కొన్నిటి గురించి తెలుసుకుందాం.

1.బ్లూ డ్రాగన్: – ఇది నీలి రంగులో ఉంటుంది. సముద్రంలోని లోతు భాగాన అడుగున కదిలాడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాణి ఎప్పుడు ఎక్కువగా వేడి నీళ్ళల్లోనే ఉంటుంది. అందుకే సముద్రపు ఉపరితలంలోని అలల మీదకి ఈ ప్రాణి రాదు.

2.నార్వేల్:- ఈ అరుదైన ప్రాణి అట్లాంటిక్ సముద్రంలో కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కువగా చల్లటి నీటిలోనే జీవిస్తుంది. భూమికి ఉత్తరాన ఉన్న అట్లాంటిక్ మంచు గడ్డలా మధ్య ఈ ప్రాణి జీవిస్తుంది. దీని ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. దాదాపు 10 అంగుళాల పొడవు ఉంటుంది. పైగా ముక్కు చివర చాలా షార్ప్ గా ఉంది పక్కన వెళ్లే చేపలను ఈజీగా చంపి తినేస్తుంది. ఇది ఎక్కువ శాతం దాని జాతి చేపలతోనే తిరుగుతూ ఉంటుంది.

3.తని డ్రాగన్:- దీని వంటి నిండా ముళ్ళు ఉంటాయి. ఇది చూడటానికి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అంతే ప్రమాదమైంది. దానికి చర్మం మీద ఉండే ముల్లుల్లో పాముకు ఉండేలా విషం ఉంటుంది. పొరపాటున దాన్ని ఎవరైనా తాకితే దాని విషం ఒంటి నిండా వ్యాపించి కొద్దీ సెకెన్ల లోనే చనిపోతారు.

4.నవలెన్ టెరైన్:- అతి చిన్నగా ఉండే ఈ జంతువు ఎక్కువ శాతం ఆఫ్రికన్ అడవుల్లోనే కనిపిస్తుంది. ఇది పాము విచిత్రమైన పక్షుల వలే అరుస్తుంది. ఈ అరుపులకు మిగతా జీవులు ఆకర్షితులై దీని వద్దకు వస్తాయి. వీటి శరీరం పైన ఉండే ముల్లులలాంటి కోణాల నుంచి విషాన్ని వెదజల్లి వాటిని చంపి తింటుంది.

5.మెంటిస్లి:- ఈ జీవి సముద్రంలో మాత్రమే బ్రతుకుతుంది. ఇది రంగి రంగులుగా ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కానీ దీని వంటి నిండా విషం ఉంటుంది. ఈ జీవి ఎక్కువ శాతం బయటికి రాదు. ఎక్కడో ఒక చోట దాక్కొని బ్రతుకుతుంది. సముద్రంలో ఉన్న నాచును ఈ జీవి ఆహారంగా తీసుకుంటుంది.

6.విశ్వస్నేక్ :- ఈ పాము ఆఫ్రికా అడవుల్లోనే కనిపిస్తుంది. ఈ పాము రాత్రిపూట మాత్రమే తన ఆహారాన్ని వేటాడుతుంది. దీని శరీర భాగం చూడటానికి పచ్చని ఆకుల్లా కనిపిస్తుంది. దాని మూలానా దాన్ని పాము అని చాలా జంతువులు గుర్తించ లేవు. ఈలోపే దాడి చేసి ఆ జంతువులను ఇది చంపి తింటుంది.

7.ఓపాబ్రి:- ఇది చూడటానికి సగం జిరాఫీ సగం జీబ్రాలా కనిపిస్తుంది. దీని వెనకుండే రహస్యాన్ని ఇప్పటికి శాస్త్రవేత్తలు కనిపెట్టలేదు. అరుదైన ఈ జంతువు ఎలా పుట్టింది, ఎలా సంక్రమణ జరిగింది అనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు.

ఇలా ఈ అరుదైన జంతువులు ప్రపంచంలోనే తమ విశిష్టతను చాటుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here