ప్రేమికులకు స్వర్గధామంగా మారిన టన్నెల్ ఆఫ్ లవ్ గురించి ఆసక్తి కరమైన విషయాలు

0
15

టన్నెల్ ఆఫ్ లవ్ (Tunnel Of Love) అనే ప్రదేశం గురించి ఒకప్పుడు ఉక్రెయిన్‌ దేశంలో తప్ప మరి ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. నిజానికి ఈ టన్నెల్ ఆఫ్ లవ్ అనే చెట్లతో కూడిన గృహ సరుకులు చేరవేయడానికి ఉపయోగించే రైల్వే ట్రాక్. ఒక గూడ్స్ రైలు రోజూ టన్నెల్ అవతలి వైపున ఉన్న ప్లైవుడ్ పరిశ్రమ నుండి అక్కడ తయారైయ్యే వాటిని రవాణా చేస్తుంది. రైలు కారణంగానే అది ప్రయాణించే దారి మొత్తం ఒక ఆకుపచ్చని సొరంగంలా కనిపిస్తుంది.

ఇంతకూ ఈ టన్నెల్ ఆఫ్ లవ్ ప్రాంతం యొక్క ప్రత్యేకతలు, విశేషాలు ఏంటి? ఇది ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ ప్రదేశంగా ఇంటర్నెట్‌లో ఎలా వైరల్ అయ్యింది? అంటే… 2009 వ సంవత్సరం వరకు ఈ టన్నెల్ ఆఫ్ లవ్ అనే ప్రదేశం గురించి కేవలం స్థానికులకు మాత్రమే తెలుసు. అయితే అక్కడ స్థానిక ఉన్న ఫొటోగ్రాఫర్ ఒకరు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులను ఫొటోలు తీస్తుండగా, హఠాత్తుగా ఆ అందమైన సొరంగం అతని కంటపడింది.

దాంతో అతను ఆ సొరంగమార్గాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ టన్నెల్ ఆఫ్ లవ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. లవర్స్ దీనిని ప్రపంచంలో ని అన్ని ప్రదేశాలకంటే అత్యంత రొమాంటిక్ ప్రదేశం టన్నెల్ ఆఫ్ లవ్ అని అంటారు.

ఎవరైనా ప్రేమికులు ఇక్కడ ఉండే చెట్లకు రిబ్బన్ కడితే, వాళ్ల కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. ఇప్పుడు ఎంతో దూరమైనా చైనా, జపాన్ నుంచి కూడా ఈ టన్నెల్ ఆఫ్ లవ్ ప్రాంతానికి వచ్చి సినిమాలు, కమర్షియల్స్‌ను యాడ్ షూటింగులు చేసుకుని వెళుతున్నారు. ఈ సొరంగమార్గం వెనుక ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి మంచి కథ కూడా ఉంది.

అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నా సమయంలో ఇక్కడికి దగ్గరలోనే మిలిటరీ బేస్ ను ఏర్పాటుచేసుకున్నారు అని ఇక్కడ వారు అంటారు. మిలిటరీ కార్యకలాపాలు బైటపడతాయేమోననే భయంతోనే రైల్వే ట్రాక్ పక్కన చెట్లను నాటి, వాటిని ఆర్చి రూపంలో తయారు చేసారు అని అంటుంటారు. ఇప్పడు కూడా టన్నెల్ మధ్య భాగంలో ట్రాక్ రెండుగా చీలిపోతుంది. ఒక దారి ప్లైవుడ్ తయారు చేసే పరిశ్రమకి వెళుతుంది. కానీ రెండోది ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలీదు. చరిత్ర ఏదైనప్పటికీ, ఈనాడు టన్నెల్ ఆఫ్ లవ్ అనే ప్రదేశం ప్రేమికుల స్వర్గధామంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here