ప్రపంచంలోని టాప్ 10 సంప‌న్న న‌గ‌రాలు

0
1054

న‌గ‌రం సంపన్నమైనది అని నిర్ణ‌యించేది ఏది? ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండ‌ట‌మా? అభివృద్ది ప్ర‌ధాన‌మా? ఎక్కువ మంది మంచి ఆదాయాన్నిచ్చే ఉద్యోగాలు చేయ‌డ‌మా? అనేవి ఎవ‌రికైన త‌ట్టే ప్ర‌శ్న‌లు. అయితే చారిత్ర‌క ప్రాధాన్యం క‌లిగి ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యంతో పాటు క‌ళ‌లు, సంస్కృతి, ప‌ర్యాట‌కంగా అభివృద్ది చెందిన ప్రాంతాలే నేడు సంప‌న్న న‌గ‌రాలుగా ఉంటున్నాయి. GDP ప‌రంగా చూస్తూ పోతే ప‌రిశ్ర‌మ‌ల వ‌ల్ల న‌గ‌ర ఆదాయం పెర‌గొచ్చు. త‌ర్వాత స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌డంలో అవే ముందు వ‌రుస‌ల‌లో నిలుస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా జీడీపీయే ప్రామాణికం. క‌నుక జీడీపీ ప‌రంగా ప్ర‌పంచంలో మొద‌టి ప‌ది స్థానాల్లో ఏ న‌గ‌రాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

10. షాంఘై (చైనా) Shanghai China : జ‌నాభా ప‌రంగా చైనాలో అతిపెద్ద న‌గ‌ర‌మైన చైనా న‌గ‌రం షాంఘై సంస్కృతి ప‌రంగా, రాజ‌కీయంగా చాలా కీల‌క‌మైన‌ది. జీడీపీ ప‌రంగా 516.5 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఇది 10వ స్థానంలో ఉంది. 2014 లెక్క‌ల ప్రకారం ఈ న‌గ‌ర జ‌నాభా 2.4 కోట్లుగా ఉంది .ప‌ర్యాట‌క ప్రాంతాలైన యు గార్డెన్‌, ది బండ్ అండ్ సిటీ గాడ్ టెంపుల్ వంటి వాటి కార‌ణంగా ఇది చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ న‌గ‌ర విస్తీర్ణం 6340 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లుగా ఉంది.

9. మాస్కో (ర‌ష్యా) Moscow: ర‌ష్యా రాజ‌ధాని న‌గ‌రం మాస్కో. దీని జీడీపీ 520 బిలియ‌న్ డాల‌ర్ల‌పైనే. 1917 విప్ల‌వం త‌ర్వాత రష్యా అతిపెద్ద న‌గ‌రం ప్ర‌పంచానికి మ‌రోసారి ప‌రిచ‌య‌మైంది. ఈ న‌గ‌రం ఎప్పుడూ యుద్దాల‌తోనూ, చారిత్రాత్మ‌క ఘ‌ట్టాల‌తోనూ త‌న‌కు ఒక స్థానాన్ని ఏర్ప‌రుచుకుంది. ఇక్క‌డ ఉక్కు, ఆహార స‌ర‌ఫ‌రా, ఖ‌నిజాలు, ర‌సాయ‌నాలు వంటి ఇత‌ర వ‌స్తువుల‌కు ప్ర‌సిద్ది పొందిన ప్ర‌దేశాలు ఉన్నాయి. ఈ న‌గ‌ర జ‌నాభా 1 కోటి నుంచి కోటి 50 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుంది. ర‌ష్యా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ప‌ర్యాట‌కం కీల‌క‌మైనందున ఉత్త‌మ ప‌ర్యాట‌క కేంద్రాల‌లో మాస్కో ఒక‌టిగా వేగంగా వృద్ది చెందుతోంది.

8. చికాగో (అమెరికా) chicago: అమెరికాలో మూడో అతిపెద్ద న‌గరం చికాగో. 2006 లెక్క‌ల ప్ర‌కారం న‌గ‌ర జ‌నాభా 28,33,321. ఈ న‌గ‌ర జీడీపీ 524.6 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. దీంతో ప్ర‌పంచంలో ఎనిమిదో ధ‌నిక న‌గ‌రంగా స్థానం పొందింది. ఆర్థిక, టెక్నాల‌జీ, వ్యాపారం, టెలిక‌మ్యూనికేష‌న్‌, ర‌వాణా, ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌పంచ కేంద్రంగా ఇది విల‌సిల్లుతోంది. ఈ న‌గ‌ర సంప‌ద ప్ర‌ధానంగా ప‌ర్యాట‌కంపై ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కడెక్క‌డి నుంచో ఈ న‌గ‌రాన్ని సంద‌ర్శించ‌డానికి నిత్యం ప‌ర్యాట‌కులు వ‌స్తూంటారు. మిసిసిపీ న‌దీ తీరాన ఉండ‌టం వ‌ల వ్యాపారానికి అనువైన జ‌ల‌మార్గాల‌ను క‌లిగి ఉంది. సాంస్కృతిక‌, ఆర్థిక, ర‌వాణా రంగంలో మిడ్ వెస్ట్ ప్రాంతానికి చికాగో ప్ర‌ముఖ కేంద్రం.

7. ఓసాకా(జపాన్‌) osaka : ఇటీవ‌లి జ‌నాభా అంచ‌నాల ప్ర‌కారం 26 ల‌క్ష‌ల 68వేల మంది ఈ న‌గ‌రంలో నివ‌సిస్తున్నారు. ఈ న‌గ‌ర జీడీపీ 654.8 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంటూ ప్ర‌పంచ ధనిక న‌గ‌రాల్లో చోటు ద‌క్కించుకుంది. క‌న్సాయ్ ప్రాంతంలో ఈ న‌గ‌రం ఉంది. యూనివ‌ర్సల్ స్టూడియోస్ జ‌పాన్‌, టెంపోజాన్ హార్బ‌ర్ విలేజ్‌, కియోసెరా డోమ్ వంటివి ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాలుగా ఉన్నాయి.దేవాల‌యాలు, చారిత్రాత్మ‌క ప్రాధాన్య కేంద్రాల‌తో పాటు పార్కులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు సైతం ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌లుగా నిలుస్తాయి.

6. పారిస్ (ఫ్రాన్స్‌) Paris: ప్ర‌పంచంలో రొమాంటిక్ ప్రాంతంగా ఈ న‌గ‌రం ఖ్యాతికెక్కింది. ఈ న‌గ‌రంలో మీరు అడుగుపెట్ట‌గానే అలాంటి వాతావ‌ర‌ణం మీకు ఆహ్వ‌నం ప‌లుకుతుంది. ఫ్రాన్స్ దేశ రాజ‌ధానే కాకుండా ఇది అతిపెద్ద న‌గ‌రం. ఉత్త‌ర ఫ్రాన్స్ ప్రాంతంలో న‌దీతీరాన వెల‌సిన న‌గ‌రానికి 2వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉంది. మిలీనియంలోనే ప్ర‌ముఖ వింత‌లుగా భావించే ఈఫిల్ ట‌వ‌ర్ ఇక్క‌డే నిర్మించ‌బ‌డింది. ఈ న‌గ‌ర జీడీపీ 669.2 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. లవ్రే మ్యూజియం, ఈఫిల్ ట‌వ‌ర్, ఆర్క్ ది ట్రొంఫె, ఛాంప్స్ ఎల్సీస్ వంటివి ప్ర‌ముఖ ఆకర్ష‌ణ‌లు.

5. లండ‌న్‌(ఇంగ్లాండ్‌) Londen : ఇంగ్లాండ్‌లో అతిపెద్ద‌దైన లండ‌న్ యునైటెడ్ కింగ్‌డ‌మ్ రాజ‌ధాని. రెండు వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన ఈ న‌గ‌రం ప్ర‌పంచ ఆర్థిక‌, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాల‌లో ఒక‌టిగా భాసిల్లుతోంది. 2015 జానాభా లెక్క‌ల ప్రకారం 86,73,710 మంది ఇక్క‌డ నివ‌సిస్తున్నారు. ఇంగ్లాండ్ వ్యాప్తంగా పర్యాట‌కుల‌కు మొద‌ట చూడాల‌నిపించే న‌గ‌రం లండ‌న్‌. ఇక్క‌డ లండ‌న్ ఐ, బ‌కింగ్‌హామ్ ప్యాలెస్‌,బిగ్‌బెన్‌క్లాక్ ట‌వ‌ర్‌, ట‌వ‌ర్ బ్రిడ్జి వంటివి ముఖ్య ప‌ర్యాట‌క ప్ర‌దేశాలల్లో కొన్ని. ఈ న‌గ‌ర జీడీపీ 731.2 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ప‌ర్యాట‌క పరిశ్ర‌మ ఉందంటే ఎంత‌గా ఈ న‌గ‌రం చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుందో గ‌మ‌నించ‌వ‌చ్చు.

4. సియోల్‌(ద‌క్షిణ కొరియా) Seoul : ద‌క్షిణ కొరియా రాజధాని న‌గ‌రం సియోల్ ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద మెట్రో న‌గ‌రం. జ‌నాభా 2 కోట్ల 56 ల‌క్ష‌లుగా ఉంది. మెట్రో న‌గ‌ర ప్రాంత జీడీపీ 731.2 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. తూర్పు ఆసియా ప్రాంతంలో ప్రాచీన నాగ‌రిక‌త క‌లిగిన వాటిలో ఇది అతి పురాత‌న న‌గ‌రంగా చెప్ప‌బడుతోంది. జపాన్‌, చైనా, కొరియా తో రెండో ప్ర‌పంచ యుద్ద స‌మ‌యంలో ఈ న‌గ‌రం బాగా న‌ష్ట‌పోయింది. అయితే 1950 నుంచి 1955 కాలంలో పున‌ర్నిర్మాణంలో అది చూపిన శ్ర‌ద్ద ప్ర‌పంచానికే ఆద‌ర్శం. కొరియ‌న్ వార్ మెమోరియ‌ల్‌, చాంగ్‌డియోక్యుంగ్ ప్యాలెస్‌, న‌మ్సాన్ పార్క్‌, ఎన్ సియోల్ ట‌వ‌ర్ ప్ర‌ధాన ప‌ర్యాట‌క ఆకర్ష‌ణ‌లుగా నిలుస్తున్నాయి.

3. లాస్ ఏంజెలెస్‌ (Las Angeles): న్యూయార్క్ న‌గ‌రం త‌ర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లాస్ ఏంజెలెస్ రెండో అతిపెద్ద న‌గ‌రం. న‌గ‌ర జ‌నాభా 37,92,621గా ఉంది. స్థూల మెట్రోపాలిట‌న్ జీడీపీ 2015 నాటికి 866 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. లాస్ ఏంజెలెస్‌కు అంత‌ర్జాతీయ వాణిజ్యం, మీడియా, ఏరోస్పేస్‌, పెట్రోలియం, ఫ్యాష‌న్‌, దుస్తుల త‌యారీ, ప‌ర్యాట‌క రంగాల ద్వారా ఆదాయం ల‌భిస్తోంది. ఏరో స్పేస్లో పేరెన్నిక‌గ‌న్న కాంట్రాక్ట‌ర్ సంస్థ‌, నార్త్‌రోప్ గ్ర‌మ్మ‌న్‌, ఎన‌ర్జీ సంస్థ ఆక్సిడెంట‌ల్ పెట్రోలియ‌మ్‌, ఆరోగ్య సంబంధిత వ‌స్తు త‌యారీ సంస్థ హెల్త్‌నెట్‌, గృహ నిర్మాణ సంస్థ కేబీ హోం లాంటి ప్ర‌ముఖ త‌యారీ సంస్థ‌ల‌తో క‌లిపి ఫార్చ్యూన్ 500 సంస్థ‌ల‌ను ఈ న‌గ‌రం క‌లిగి ఉంది.

2. న్యూయార్క్ (New York) : అమెరికా చారిత్ర‌క న‌గ‌రాల్లో మొద‌టి వ‌రుస‌లో ఉండే న‌గ‌రం న్యూయార్క్‌. ప‌గ‌లు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. బ్యాంకింగ్‌,ఫైనాన్స్; రిటైల్; ప‌్ర‌పంచ వాణిజ్యం, ర‌వాణా, ప‌ర్యాట‌కం, స్థిరాస్తి, కొత్త‌త‌రం మీడియా, సంప్ర‌దాయ మీడియా, అడ్వ‌ర్టైజింగ్‌, న్యాయ సేవ‌లు, అకౌంటెన్సీ, బీమా, ధియేట‌ర్‌, ఫ్యాష‌న్‌, క‌ళ‌లు వంటి వాటికి న్యూయార్క్ పెట్టింది పేరు. ఈ న‌గ‌ర జీడీపీ 1210 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా జ‌నాభా 85 ల‌క్ష‌ల 50వేలుగా (తాజా లెక్క‌ల ప్ర‌కారం) ఉంది. న‌గ‌ర విస్తీర్ణం 1213 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీ ప‌ర్యాట‌కుల‌కు ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌. ఈ న‌గ‌రాన్ని ప్ర‌తి సంవ‌త్స‌రం 4 కోట్ల మంది సంద‌ర్శిస్తుంటారు. అమెరికాలో అత్య‌ధికులు సంద‌ర్శించే సెంట్ర‌ల్ పార్కు న్యూయార్క్ సెంట్ర‌ల్ పార్క్‌. ప‌ర్యాట‌కుల‌ను ఎక్కువ‌గా ఆకర్షించే ప్ర‌దేశాల‌లో ముఖ్యమైన‌వి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌, ఎల్లిస్ ఐలాండ్‌, బ్రాడ్‌వే థియేట‌ర్ నిర్మాణాలు, వాషింగ్ట‌న్ స్క్వేర్ పార్క్‌, రాక్ ఫెల్ల‌ర్ సెంట‌ర్‌, టైమ్స్ స్క్వేర్‌, ది బ్రోక‌న్స్ జూ, న్యూయార్క్ బొటానిక‌ల్ గార్డెన్‌. న్యూయార్క్ న‌గ‌రంలో ఉన్న ఉద్యాన‌వ‌నాల విస్తీర్ణం 28 వేల చ‌ద‌ర‌పు ఎక‌రాలు.

1. టోక్యో (Tokyo) : ప్ర‌పంచ మెట్రో న‌గ‌రాల్లో జ‌న‌స‌మ్మ‌ర్థ‌మైనది టోక్యో. 2016లో ప్ర‌పంచంలోనే సంప‌న్న న‌గ‌రంగా విరాజిల్లుతోంది. జీడీపీ 1520 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. జ‌పాన్ ప్ర‌భుత్వ పcపంచంలో మూడు ప్ర‌ధాన వాణిజ్య న‌గ‌రాల‌లో టోక్యో ఒక‌టి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 51 ఇక్క‌డే ఉన్నాయి. 1కోటి 30 ల‌క్ష‌ల‌కు పైగా జ‌నాభా క‌లిగిన ఈ జ‌పాన్ న‌గ‌రం ఆర్థికంగా కీల‌క కేంద్రంగా ఎదుగుతోంది. ఎక‌న‌మిక్స్ ఇంటెలిజిన్స్ యూనిట్ అధ్య‌య‌నం మేర‌కు 2006 వ‌ర‌కూ వ‌రుస‌గా 14 సంవ‌త్స‌రాలు అత్య‌ధిక ఖ‌రీదైన న‌గ‌రంగా ఉంది. 2020 ఒలింపిక్స్‌కు టోక్యో న‌గ‌రం ఆతిథ్య‌మివ్వ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here