సుధీర్ బాబు సమ్మోహనం మూవీ రివ్యూ

0
914

ఇంద్రగంటి మోహన్ కృష్ణ . ఎప్పుడు ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకుంటాడో తెలియదు కానీ ప్రేక్షకులను బాగా అలరించడం ఈయనకు సినిమాతో పెట్టిన విద్య. సినిమా సినిమాకు డిఫరెంట్ కథలు పాత్రలు ఎంచుకునే ఈ దర్శకుడు సమ్మోహనం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. మరి సమ్మోహనం సినిమా ప్రేక్షకులను సమ్మోహనం చేసే రీతిలో ఉందొ లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ ఫిల్మ్ యాక్టర్ అయిన అమ్మాయి లైఫ్ లో అన్ని రియాలిటీ కి దగ్గరగా ఉండే విషయాలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఒక కామన్ మ్యాన్ అయిన ఓ అబ్బాయి విషయంలో అన్ని సినిమాటిక్ విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో అనుకోకుండా వీరిద్దరూ తారస పడతారు. కాదు కాదు ఒకరి జీవితాలలోకి ఒకరు వచ్చేస్తారు. మరి ఆ తరువాత వీరి జర్నీ ఎలా సాగింది అన్నదే ఈ సినిమా కథ.

ముందుగా ఈ సినిమా గురించి చెప్పుకునే ముందు, దర్శకుడి టేస్ట్ కి సలాం చెయ్యాల్సిందే. సినిమాలో ఉన్న ప్రతి సన్నివేశం మనకో కొత్త రకమైన ఫీలింగ్ ని ఇస్తుంది. నిజంగా ఇంద్రగంటి అందరిని ఆశ్చర్య పరిచాడు అని చెపుకోవచ్చు. ఈ మూవీ లో కాస్టింగ్ కౌచ్ అనే అంశాన్ని కూడా టచ్ చేసాడు దర్శకుడు. నేను కూడా కెరియర్ కోసం సక్సెస్ కోసం కాంప్రమైజ్ అయ్యానని అనుకుంటున్నావా అని హీరోయిన్ హీరోని ప్రశ్నిస్తుంది. హీరో హీరోయిన్ల సంఘర్షణకు కీలకమైన పాయింట్ ఇదే.

సినిమా సాహిత్యం బ్రతికే ఉంటాయి అని ప్రారంభం అయ్యే టీజర్ లోని ఈ ఒక్క డైలాగు ఆసాంతం సినిమాను ముందుకు నడిపిస్తుంది. అంత ఎమోషనల్ లవ్ స్టోరీ సమ్మోహనం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను నిలబెట్టింది అని చెప్పుకోవచ్చు. నటుడిగా సుధీర్ బాబుకి ఇది మరిచిపోలేని చిత్రం అవుతుంది. మొత్తానికి సమ్మోహనం అందరిని సమ్మోహనం చేసే ఒక ఫీల్ ఉన్న గుడ్ లవ్ జర్నీ .

watch the video for more details about this movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here