పండ్లపై స్టిక్కర్లను ఎందుకు అంటిస్తారో… అవి దేనిని సూచిస్తుందో తెలుసా?

0
75

మన ఆరోగ్యం కోసం రకరకాల పండ్లు తినడం మంచిదని వైద్యులు చెబుతారు… ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా ఫ్రూట్స్‌ తింటే మేధాశక్తి పెరుగుతుంది.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో ఏది మంచిదో.. ఏదీ కల్తీయో తెలుసుకోవాలంటే కష్టంగా మారుతంది… ఫలితంగా రోగాలను కొనితెచ్చుకున్నట్లవుతంది..

అయితే ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వాలు పండ్లపై కొన్ని నెంబర్లు వేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.. ఫలితంగా ఆ పండ్ల గురించి తెలిసిన వారు ఎక్కువగా కొనుగోలు చేయడంతో వ్యాపారం బాగుండడంతో పాటు వినియోగదారులు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారని సర్వేలు చెబుతున్నాయి.  అయితే ఆ పండ్లపై ఉన్న నెంబర్లను మనం ఎలా గుర్తించాలి..? అసలు ఆ నెంబర్లు ఏం తెలుపుతాయనే ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటగా.. కొన్ని పండ్లపై నాలుగు అంకెల సిరీస్‌ ఉంటుంది.. ఈ అంకెలు  3 లేదా 4 అంకెతో ప్రారంభమైతే కృత్రిమ రసాయనాలు, సహజ ఎరువు వేసి పండించారని అర్థం.. ఈ స్టిక్కర్లను 20 శతాబ్దంలో వ్యవసాయంలో వచ్చిన మార్పుల ఆధారంగా వేశారట.   ఈ నెంబర్లు ఉన్న ఫ్రూట్స్‌ ఆరోగ్యాన్నిచ్చినా వ్యాధిగ్రస్తులకు సమస్యలు తెచ్చిపెడుతాయట.

రెండోది.. పండ్లపై 5 అంకెల సిరీస్‌ ఉండి ఆ నెంబర్‌ 9తో ప్రారంభమైతే పూర్తిగా సేంద్రియ ఎరువుల ద్వారా పండించారని అర్థం. వీటి వల్ల మన శరీరానికి ఎలాంటి హాని కలిగించవు. పూర్తిగా సురక్షితమైనవి..

ఇక మూడోది.. పండ్లపై 5 అంకెల సిరీస్‌ ఉండి ఆ నెంబర్‌ 8తో ప్రారంభమైతే  ఇవి జన్యుమార్పిడి ద్వారా పండించారని అర్థం చేసుకోవాలి.. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల పండ్లు కొనేటప్పుడు ఇలాంటి నెంబర్లు ఉన్న స్టిక్కర్లను చూసి కొనాలని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here