భరత్ అనే నేను సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేసిన నమ్రతా, మహేష్ బాబు

0
1247

బారి అంచల మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్యం లో వస్తున్నా రెండవ సినిమా భారత్ అనే నేను రేపు విడుదలకి సిద్ధమైంది. ఇందులో మహేష్ బాబు మొదటి సరిగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోయున్నాడు. మహేష్ బాబు పక్కన కైరా అద్వానీ ముఖ్యమంత్రికి ప్రియురాలుగా ఆక్ట్ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో కొరటాల శివ మహేష్ బాబు కలిసి తీసిన శ్రీమంతుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ అదే కాంబినేషన్ లో భారత్ అనే నేను తో ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. అందులో వచ్చాడైయో స్వామి అనే సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపుతుంది. దేవ్ దానయ్య తన నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకోని భారీగా ఈ సినిమాని విడుదలకు ప్లాన్ చేసారు.

సినిమా ఎలావుండబోతుంది అంటే:
సినిమా మొదలైన పది నిమిషాల నుండి మహేష్ బాబు సీఎం గా కనిపిస్తానని మహేష్ బాబు నిన్న జరిగిన మీడియా ఇంటరేక్షన్ లో చెప్పాడు. అయితే ముఖ్యమంత్రి అయినా తరువాత తాను చేసిన ప్రమాణాలను మరియు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మహేష్ చేసి కృషి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని సినిమా లో పని చేసిన వారు చెప్తున్నారు. సినిమాలో మహేష్ బాబు చాలా ఫ్రెష్ లుక్ లో కనిపించనున్నారు. మహేష్ బాబు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసే సమయం లో మహేష్ చెప్పిన వాయిస్ లో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి వాయిస్ అచ్చు గుద్దినట్లు ఉందని అందరు అన్నట్లే, మహేష్ బాబు గారు కూడా నిన్న మీడియా ఇంటరాక్షన్ లో చెప్పారు.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో అత్యధికంగా ప్రయోగాలు చేసిన ఘనత సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్కుతుంది. విజయ విషయాన్ని భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న మహేష్ బాబు ప్రయోగాలు చేయడం నిజంగా విశేషం. అయితే ఎంతో ఎక్కువగా కొత్తదనం కోరుకునే మహేష్ కి తన కెరియర్ లో అతను చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నాడు. అయినా వెరవకుండా డిఫరెంట్ రూటులోనే వెళ్తున్నాడు. మహేష్ కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ కూడా భిన్నంగానే కనిపిస్తోంది. కానీ ఇకపై తాను రిస్క్ తీసుకోనని మహేష్ తేల్చి చెప్పడం విశేషం.

ఇకపై అభిమానులు కోరుకునే సినిమాలే చేస్తానని మహేష్ స్పష్టం చేశాడు. ప్రయోగాలు చేసీ చేసీ అలసిపోయా. ఇక మీదట కూడా చేస్తే నాన్నగారి అభిమానులు ఇంటికొచ్చి మరీ కొడతారు. ఇక మీదట కమర్షియల్ సినిమాలు చేస్తా. చాలా సినిమాల్లో నా పాత్రల విషయంలో ప్రయోగాలు చేశాను. నేరుగా చెప్తున్నాను… ఇకపై నా అభిమానులు నన్ను ఎలాంటి సినిమాల్లో అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలే చేస్తాను’’ అని మహేష్ స్పష్టం చేశాడు. అభిమానుల కోసం సినిమాలు చేస్తానంటూనే.. అభిమానుల తీరు కూడా మారాలని మహేష్ సూచించాడు. ఓ హీరో సినిమా విడుదలైతే మిగిలిన హీరోల అభిమానులు దాన్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది సినిమాకి మంచిది కాదని.. అలాంటి అభిమానులంతా మారాల్సిన అవసరం ఉందని మహేష్ అభిప్రాయపడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here