మెహబూబా మూవీ రివ్యూ

0
1068

చాలా రోజుల తరువాత పూరి బ్యాక్ with లవ్ స్టోరీ అని చెప్పి తీసిన సినిమా మెహబూబా. ఈ సినిమాని పూరి జగన్నాధ్ బాగానే ప్రెసెంట్ చేసాడు… సిన్సియర్ గానే సినిమాని టెక్ అప్ చేసాడనే చెప్పాలి. కానీ స్టోరీ లైన్ మాత్రం మనకి ఇంతకూ ముందు రెండు మూడు సినిమాలలో చుసిన స్టోరీ లైనే కదా ఇందులో కొత్తదనం ఏముంది అని అనిపించడంవల్ల ఈ సినిమా స్టోరీ సూపర్ అన్ని చెప్పలేం. ఆకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంతకుముందు తాను యాక్ట్ చేసిన సినిమాలలో తన నటనను బాగానే నిరూపించుకున్నాడు. అతను మంచి ఆక్టర్ అని మనకి ముందే తెలుసు. ఇంక ఆకాష్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోగా చేసాడు కాబట్టి పూరి ఇచ్చిన ఎమోషన్స్ ని సినిమా మొత్తం క్యారీ చేస్తూ… తన పాత్రకి 100% న్యాయం చేసాడనే చెప్పొచ్చు. కాకపోతే అక్కడక్కడా తన బాడీ కి అక్కడ జరిగే ఫైట్ సీన్స్ కి… యుద్ధ సన్నివేశాలకి కొంచెం మ్యాచ్ అవ్వడంలేదేమో అని అనిపిస్తుంది. అలా అనిపించిన వెంటనే ఆ పర్లేదులే పూరి జగన్నాధ్ కదా సినిమా తీస్తున్నాడు…. పూరి జగన్నాధ్ కొడుకే కదా అని అలా అడ్జెస్ట్ అయిపోతాం అన్నమాట.

నేహా శెట్టి ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పడానికి అంట మంచి సెన్స్ ఏమి ఉండవు. కాకపోతే తనకిచ్చిన పరిధిమేరకు బాగానే చేసింది అని చెప్పొచ్చు. ఇక ఆకాష్ పక్కన లవర్ గా కూడా బాగానే సెట్ అయ్యింది అనే చెప్పాలి. ఆకాష్ డెబ్యూ కి ఒక కరెక్ట్ హీరోయిన్ లా నేహా శెట్టి ఉంటుంది. ఎందుకంటే పూరి జగన్నాధ్ హీరోయిన్ సెలక్షన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అంతే కాకుండా మెహబూబా సినిమాకి అందులో ఆమె చేసిన క్యారెక్టర్ కి సూటబుల్ హీరోయిన్ అని చెప్పొచ్చు.

ఈ సినిమాలో పూరి మనకు ఒక కొత్త విలన్ ని ఇంట్రడ్యూస్ చెయ్యడానికి ట్రై చేసాడు… అయన చూడడానికి బాగానే ఉన్నాడు. కాకపోతే పాకిస్తాన్ లో తెలుగు మాట్లాడుతూ అలా అరుస్తూ… అక్కడక్కడా హీరోకి కౌంటర్ ఇస్తూ… ఫైట్ సీన్స్ కి మాత్రమే పరిమితం, ఒక విలన్ ఉండాలి కాబట్టి అనే రకమైన పాత్ర కాబట్టి… ఆయనకూడా బాగానే సెట్ అయ్యాడు ఓకే బాగానే యాక్ట్ చేసాడనే చెప్పొచ్చు. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో స్టార్ట్ అవుతుంది. అంత మంచిగా స్టార్ట్ అయినా సినిమా…. కొంచం సేపటికే ఏంటి ఈ సినిమా మగధీర సినిమాలా ఉంది అని అనిపిస్తుంది.

ఇంకా సెకండ్ హాఫ్ లోకి వచ్చేటప్పటికి, గదర్ ఏక్ ప్రేమ కథ అనే మన సన్నీ లియోన్ సినిమా లోని కొన్ని సీన్స్ షేడ్స్ మనకి ఈ సినిమాలో గుర్తు వస్తూవుంటాయి. ఇంకా ఈ సినిమాలో పూరి జగన్నాధ్ ఈ లవ్ స్టోరీ ని ప్రెసెంట్ చెయ్యటానికి ఇనీషియల్ అట్టెంప్ట్ మాత్రమే ఇచ్చాడు కానీ , కాక పోతే ఈ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కొంచెం ఆ లవ్ ఫీల్ ఆడియన్స్ కి తగలడం తక్కువ. మరియు నేషనలిజం ని కూడా కొంచం ఎంకరేజ్ చెయ్యటానికి ప్రయత్నించాడు పూరి . ఆ సీన్స్ అక్కడక్కడా పండాయి కానీ మిగతా చోతలంతా అబ్బా ఏంటి మరీ ఓవర్ గా అనిపించినట్టు ఉంటాయి.

ఇంకా ఈ సినిమాలో వచ్చే కొన్ని కొన్ని సీన్స్ కూడా ప్రాక్టీకాలిటీకి, రియాలిటీకి చాలా దూరంగా , కేవలం స్టోరీ కి అనుకూలంగా , మన ఆకాష్ పూరి పెరఫామ్ చెయ్యడానికి అనుకూలంగా రాసుకొని తీసిన సీన్స్ లాగ కొన్ని కొన్ని సీన్స్ అనిపిస్తాయి.

ఇంకా లాస్ట్ గా ఈ సినిమా గురించి చెప్పేదేమిటంటే, ఈ సినిమాలో మన వింటే పూరి జగన్నాధ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ కానీ , ప్రెజెంటేషన్ కానీ , హీరోయిజం కానీ , లవ్ స్టోరీ కానీ చూద్దాం అని మనం కొన్ని ఎక్స్పెక్టషన్ పెట్టుకుంటే మనం కొంచెం ఎక్కువ డిజప్పోయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పూరి తన కొడుకు తో సినిమా తీస్తున్నాడు కాబట్టి , ఒక కొత్త కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ తో వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసినా కూడా మనం కొంచెం ఎక్కువ డిజప్పోయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

ఇండియా , పాకిస్తాన్ మధ్యలో ఉన్న స్టోరీ కాబట్టి , ఈ స్టోరీ చాలా ఎక్సార్డినరీ గా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేసినా కూడా మనం కొంచెం ఎక్కువ డిజప్పోయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా క్లైమాక్ లో సీన్స్ అలా వస్తూ వస్తు వెళ్లిపోతుంటాయి . అంటే జస్ట్ మనం అలా చూస్తూ ఉంది పోతాం. మొత్తానికి పూరి ఈజ్ బ్యాక్ అని మనం అనుకునే లోపలే , ఓ ఓకే ఇతను మళ్ళి వస్తాడు అనే విధంగా ఈ సినిమా కంక్లూడ్ అవుతుంది. పర్లేదు, ఎమ్ పర్లేదు మేము ఎప్పటికి పూరీని ప్రేమిస్తూనే ఉంటాం. అందుకని మేము కచ్చితంగా అతని కోసం వెయిట్ చేస్తాము. ఇంకా నేను ఇంటి కి వెళ్లి పూరి సినిమాలు చూసి కొంచెం రిలాక్స్ అవుతాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here