మహానటి మూవీ రివ్యూ & రేటింగ్

0
1140

ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత డైరక్టర్ నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథతో సినిమా చేయాలని భావించారు. ఆలోచన రావడమే ఆలస్యం ఆమె జీవిత గాథను తెలుసుకున్నారు. ఆమెతో సినిమాలు చేసిన వారి దగ్గర నుండి కొంత సమాచారం తెలుసుకున్నారు. ఫైనల్ గా మహానటిగా సావిత్రి బయోపిక్ తెరరూపం దాల్చింది.

మహానటి టైటిల్ రోల్ పోశించింది మలయాళ భామ కీర్తి సురేష్. సినిమా కోసం ఆమె ఎంత కష్టపడ్డది సినిమా టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. నటిగా అభినయ తారగా సావిత్రి పేరు మారుమోగుతుంది. నేటితరం తారామణులకు ఆమె ఆరాధ్య దైవం. సాధ్యమైంతవరకు ఆమె జీవితంలో జరిగిన మంచి చెడుల గురించి ఈ సినిమా ప్రస్థావించడం జరిగిందట.

ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, క్రిష్, సమంత, షాలిని పాడే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఇలా అందరు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. నిజ జీవిత పాత్రలని నటించే అదృష్టం కొందరికే వస్తుంది. అలా ఆనాటి పాత్రలన్నిటిని అద్భుత దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారు దర్శకుడు నాగ్ అశ్విన్.

స్వప్నా సినిమాస్ బ్యానర్ లో స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంగీత పరంగా కూడా ప్రాముఖ్యత తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచగా కచ్చితంగా సినిమా మంచి ఫలితాన్నే తెచ్చుకుంటుందని ఆశిస్తున్నారు. సావిత్రి బాల్యం, ఆమె నటిగా మారిన పరిస్థితులు, ఆమె హీరోయిన్ గా మహానటిగా కిరీటం అందుకున్న రోజులనే కాకుండా చివరి దశలో ఆమె పొందిన దీన అవస్థను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. మరి సినిమా మనసులను కదిలించే కథ అయినా ఏమేరకు ప్రేక్షకులకు మెప్పించిందో లేదో మన సమీక్షలో చూద్దాం.

కథ : జీవిత కథను సినిమాగా తెరకెక్కించే క్రమంలో కథ ఇది అని చెప్పలేం. ప్రజావాణి జర్నలిస్ట్ అయిన మధురవాణి (సమంత) సావిత్రి మీద ఓ స్టోరీ కవర్ చేయాలని చూస్తారు. ప్రజావాణి ఫోటోగ్రాఫర్ గా విజయ్ దేవరకొండ నటించారు. కోమాలో ఉన్న సావిత్రి గురించి మధురవాణి కవర్ చేసే స్టోరీనే సావిత్రి జీవిత కథగా తెర మీద చూపిస్తారు. ఆమె సినిమా తెరంగేట్రం.. హీరోయిన్ గా టాప్ రేంజ్ కు వెళ్లడం.. కుటుంబ కలహాలు.. మధ్యానికి బానిస అవ్వడం.. చివరి దశల్లోకి వెళ్లడం ఈ కథ అంతా ప్రస్థావించడం జరిగింది.

సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా నటించారు. మహానటిగా కీర్తి సురేష్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. కచ్చితంగా అవార్డులు సైతం వచ్చేలా కీర్తి నటన ఉంది. ఇక సినిమాలో వాణి, విజయ్ ల నటన బాగుంది. సమంత కూడా క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో బాగా నటించింది. జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ బాగా చేశాడు. ఇక ఏయన్నార్ గా నాగ చైతన్య సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఎస్వీయార్ గా మోహన్ బాబు, దర్శక నిర్మాత చక్రపాణిగా ప్రకాశ్ రాజ్, కెవి చౌదరిగా రాజేంద్ర ప్రసాద్, క్రిష్ లాంటి నటులు నిజ పాత్రలకు ఏమాత్రం తీసిపోకుండా నటించడం జరిగింది.

తెలిసిన కథను డీటైల్డ్ గా సినిమాగా చెప్పడంలో చాలా తెలివితేటలు ఉండాలి. సావిత్రిగా తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న మహానటి జీవిత కథను సినిమాగా తెరకెక్కించిన తీరు అద్బుతమని చెప్పొచ్చు. దర్శకుడు సావిత్రి జీవితంలో ముఖ్య ఘట్టాలను చాలా క్లారిటీతో తెరకెక్కించాడు. తారల అభినయం తారాస్థాయిలో ఉండగా.. కథ, కథనాలు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. మొదటి భాగం కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగించగా సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. సావిత్రి పతనం ఇంకా ప్రా క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్స్ కంట తడి పెట్టించేదిగా ఉంటాయి. పాత్రలన్ని తమ అద్భుత నటనతో మాహనటి సినిమాకు ప్రాణం పోశాయి.

ప్లస్ పాయింట్స్ : కీర్తి సురేష్, అన్ని పాత్రల అభినయం, కథనం, క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ : అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ : మహానటి.. పర్ఫెక్ట్ బయోపిక్..!

రివ్యూ & రేటింగ్ : 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here