కేరళ బస్సులపైకి ఎక్కిన పోర్న్‌స్టార్లు… ఆ బస్సుల ప్రత్యేకతలేంటో చూడండి.

0
795

వ్యాపారం చెయ్యడానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పంథా అనుసరిస్తారు . తమ ఖాతాదారులను పెంచుకునేందుకు టెలికం కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయి. వస్త్ర దుకాణాలు ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ఊదరగొడతాయి. ధరల తగ్గింపు, ఉచిత డెలివరీ.. బిజినెస్ ని పెంచుకునేందుకు ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇటీవల రూపాయి పతనాన్ని కూడా తమ బ్రాండ్‌ ప్రచారానికి ఉపయోగించుకుంది డ్యూరెక్స్‌ ఇండియా కండోమ్ కంపెనీ‌. ఈ యాడ్‌ సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అయిన విషయం తెలిసిందే.

ఇక పర్యాటకులను ఆకట్టుకోవడంలో కేరళా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. కేరళా ప్రభుత్వం నుండి పర్యాటక(Travel) సంస్థలు వరకు ప్రతి ఒక్కరూ కొత్త రకమైన ఐడియాలతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన చిక్కోస్ టూర్స్ అనే సంస్థ కొంచెం వినూత్నంగా ఆలోచించింది. సాధారణంగా బస్సులు, ఆటోలపై సినిమా పోస్టర్లు, కాలేజీల పోస్టర్లను చూస్తుంటాం..

కానీ కేరళకు చెందిన ఈ ట్రావెలింగ్ సంస్థ మాత్రం ప్రయాణికులను ఆకర్షించేందుకు ఏకంగా బస్సుపైకి పోర్న్‌స్టార్లను ఎక్కించేసింది. సంస్థకు చెందిన అన్ని బస్సులపైనా సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్‌స్టార్ల ఫొటోలను అతికించింది.

అంతే, ఒక్కసారిగా వారి బస్సులకు డిమాండ్ పెరిగిపోయింది. ఫొటోలు ఒక్కటే కాదు.. ఈ సంస్థకు చెందిన లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా డీజే కూడా ఏర్పాటు చేయడం మరో విశేషం.

పలువురి పోర్న్ స్టార్ల ఫొటోలతో అందంగా ముస్తాబై రోడ్డుపై వెళ్తున్న ఈ బస్సులను చూసేందుకు కూడా జనాలు ఎగబడుతున్నారట. కేరళకే చెందిన ఓ ఫొటోగ్రాఫర్ ఈ బస్సుల ఫొటోలు తీసి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి.”కేరళలోని బస్సులు.. సీరియస్‌గా తీసుకోవద్దు” అని ట్విటర్‌లో పోస్టు చేశాడు. అయితే ఈ పోస్ట్‌కు పోర్న్‌ స్టార్‌ కీరన్‌ లీ స్పందిస్తూ ‘ఆకట్టుకునేలా’ ఉందనడం ఇక్కడ విశేషం.

ఇక బస్సులపై సన్నీలియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్‌స్టార్ల పోస్టర్లను అతికించినందుకు, బస్సుల్లో డీజే సిస్టమ్ కూడా ఉండడంతో దానికి తగ్గట్టే ప్రయాణికుల నుంచి భారీగా టికెట్‌ ధరలు వసూలు చేస్తున్నారట. వీలైతే మీరు తిరవనంత పురం వెళ్లినప్పుడు ఈ బస్సులపై ఒక్క లుక్ వెయ్యండి. కుదిరితే అందులో ప్రయాణించండి. అది మీ ఛాయిస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here