శ్రీనివాసరెడ్డి ‘జంబలకిడిపంబ’ మూవీ రివ్యూ

0
1098

మగాళ్లు ఆడవారిలా, ఆడాళ్లు మగవారిలా ప్రవర్తించడాన్ని ‘జంబలకిడిపంబ’ అంటున్నారు. హాస్యరస చిత్రాలతో తెలుగువాళ్లను విపరీతంగా నవ్వించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తీసుకొచ్చిన ఈ పదమే కాదు సినిమా కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్. తరతరాలు గుర్తుండిపోయేలా ‘జంబలకిడిపంబ’ పేరిట విలక్షణమైన హాస్య చిత్రాన్ని తెరకెక్కించారయన. అప్పటి నుంచి ఈ పదం బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు దాన్నే మళ్లీ టైటిల్‌గా తీసుకుని హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా సినిమా తెరకెక్కింది.

 

గీతాంజలితో మొదటి ప్రయత్నం సక్సెస్ అవగా జయమ్ము నిశ్చయమ్మురా సినిమా నిరాశపరచింది. ఇక ముచ్చటగా మూడోసారి ఓ సూపర్ హిట్ సినిమా టైటిల్ తో జంబ లకిడి పంబ అంటూ వస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి. జె.బి మురళి కృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఎనాటి సమీక్షలో చూద్దాం.

 

జంబలకిడిపంబ పేరుకు తగ్గట్టే ఈ సినిమాలోనూ అటు ఇటుగా ప్రవర్తిస్తారట. రెండు ఆడ, మగ ఆత్మలు విరుద్ధంగా పురుషుడు, స్త్రీ శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. ఆ స్త్రీ, పురుషులు భార్యాభర్తలు. దీంతో వారి మధ్య మనస్పర్థలు వస్తాయి. అవి విడాకులు తీసుకునేంత వరకు వెళ్తాయి. ఈ మధ్యలో బోలెడన్ని ట్విస్టులు. ఇంతకీ వారు విడాకులు తీసుకోవాలని ఎందుకనుకుంటారు? ఆ ఆత్మల కారణంగా శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నానిలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది సినిమాలో చూడాలి.

 

నటీనటుల ప్రతిభ : శ్రీనివాస్ రెడ్డి చాలా బాగా చేశాడు. లేడీ అభినయం తో తన పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక హీరోయిన్ సిద్ధి ఇద్నాని పాత్ర కూడా బాగుంది. హీరోతో సమానంగా ఆమె నటన కనబరచింది. వెన్నెల కిశోర్ ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. పోసాని పాత్ర కూడా విచిత్రంగా ఉంటుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

జంబలకిడి పంబ అనగానే ఈవివి తీసిన సూపర్ హిట్ సినిమా గుర్తుకొస్తుంది. ఆ టైటిల్ తో శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రయత్నమే ఈ జంబ లకిడి పంబ. సినిమా కథ కొత్తగా అనిపించినా కథనంలో దమ్ము చూపలేదు. దర్శకుడు మురళికృష్ణ ఏమాత్రం ఆకట్టుకునే కథనం రాసుకోలేదు.

 

మొదటి భాగం కొంత బోర్ కొట్టించేస్తుంది. సెకండ్ హాఫ్ శ్రీనివాస్‌రెడ్డి, సిద్ది ఆత్మల మార్పుతో కథ మరోమెట్టు ఎక్కుతుంది. ఆడవాళ్ల బాధలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం, అలాగే మగవాళ్ల సమస్యలు ఏ విధంగా ఉంటాయనే అంశంతో కథలో వేగం పెరుగుతుంది. కథ శ్రీనివాస్‌రెడ్డి సొంతూరుకు చేరడం, అక్కడ నుంచి కథ అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. చివర్లో ఆసక్తికరమైన అంశంతో సినిమా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌తో ముగిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here