నీ భార్య ప‌రాయి మ‌గాడితో అలా ఉండ‌టం చూస్తే నువ్వు ఏం చేస్తావు?

0
2264

మన దేశంలో ఐ ఏ యస్ ఆఫీసర్స్ అంటే ఎంతో గౌరవం ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం సాధించడం అంటే చాలా కష్టం. మన దేశంలో అత్యంత కష్టమైన పరీక్ష అంటే కేవలం సివిల్ సర్వీసెస్ అనే చెప్పాలి. ఇలాంటి ఉద్యోగాలు సాధించే సమయంలో వ్రాత పరీక్ష పూర్తి అయిన తరువాత ఇంటర్వ్యూ సమయంలో ఎవరు ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి అభ్యర్థులకు. అసలు ఇలాంటి ప్రశ్నలు కూడా సివిల్స్ అభ్యర్థులను అడుగుతారా అని కూడా ఆశ్చర్య పోతారు. ఇక కుటుంబాలు, వ్యక్తిత్వాలు, మీ పర్సనల్ అన్ని విషయాలలో గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతారు.

అయితే మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే కోరికతో వారు ఈ పని చెయ్యడం లేదు. కేవలం మీ భావాలు ఎలా వ్యక్తీకరిస్తారు, మీరు చెప్పే సమాధానాలలోనే మీ వ్యక్తిత్వాన్ని పసిగడతారు ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు. ఇటీవల ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్న ఓ అభ్యర్థి షాక్ అయ్యేలా చేసింది. మీ భార్య పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుందనేది మీరు కళ్లారా చూస్తే నువ్వు ఎలా స్పందిస్తావు? అని అడిగారు అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్. ఇక ఇలాంటి ప్రశ్న ఎవరికైనా ఎదురైతే ముందు కోపం నషాళానికి అంటుతోంది. ఎదుటి వారిని తిట్టడం మొదలు పెడతాం.

కానీ సివిల్ సర్వీస్ ఉద్యోగానికి వచ్చిన వ్యక్తి కాబట్టి దానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనికి అతను చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. అది ఏమిటంటే, నా భార్య పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే, ఆ వ్యక్తిపై IPC సెక్షన్ 497 కింద అతనిపై కేసు పెడతానని, అతని ఫై కేసు పెట్టి ఆ సాక్ష్యాధారాలతో అతన్ని న్యాయస్థానం ముందు నిలబెడతానని, దీంతో అతనికి జరిమానా అయినా లేక కఠిన శిక్ష పడేలా చేస్తాను అని చెప్పాడు ఆ వ్యక్తి. దీంతో ఆ ఆఫీసర్ కూడా సమాధానం విని ఆలోచించాడు. అయితే ఇక్కడ ఆ అమ్మాయిది కూడా తప్పు ఉంది. మరి ఆ అమ్మాయిని ఎందుకు శిక్షించలేదు?

ఆ అబ్బాయికి మాత్రమే ఎందుకు శిక్షా? అంటే, ఇలాంటి విషయాలలో మహిళలకు ఎలాంటి శిక్ష ఉండదు. కేవలం అబ్బాయిలు మాత్రమే శిక్షకు గురి అవుతారు. అమ్మాయిది తప్పు ఉన్నా, ఆమెకు శిక్ష కాదు కదా, అసలు కేసు కూడా నమోదు చెయ్యరు. అయితే దీని వెనుక బలమైన కారణం ఏమిటంటే, ఆమె భర్త పరువుకు భంగం వాటిల్ల కుండా అతనికి ఎటువంటి పరువు పోకూడదని ఇలాంటి విషయాలలో ఆమెపై కేసులు పెట్టరని తెలుస్తుంది. ప్రపంచంలో చాలా దేశాలలో ఇలాంటి పనులు చేస్తే శిక్షలు ఉంటాయి.

కానీ మన దేశంలో మాత్రం ఎటువంటి శిక్షలు లేవని చట్టాలు చెబుతున్నాయి. కేవలం దొంగతనం, హత్య నేరాల విషయాలలో మాత్రమే కేసులు పెట్టడం శిక్షలు పడటం జరుగుతున్నవని చెబుతున్నారు.ఇలాంటి ప్రశ్నలు అడగటం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, సమాజంలో ఇలాంటి కేసుల విషయంలో వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని వీరిని ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. మొత్తానికి ఇలాంటి ప్రశ్నలు అడిగి అతని ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here